Site icon HashtagU Telugu

Thalapathy Vijay: దళపతి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. విజయ్ ను డైరెక్ట్ చేయనున్న త్రివిక్రమ్!

Mixcollage 13 Mar 2024 10 11 Am 4945

Mixcollage 13 Mar 2024 10 11 Am 4945

ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక విషయంతో విజయ్ దళపతి పేరు సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన రాజకీయ విషయాల గురించి సినిమాల విషయాలు గురించి తరచూ అనేక రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇకపోతే విజయ్ నటిస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ పుష్ప 2 తో పాటు పోటీగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అంటే బాక్సాఫీస్ దగ్గర క్లాష్ గట్టిగానే ఉండనుంది.

అయితే విజయ్ చివరి చిత్రం గురించి సర్వత్రా చర్చనీయాంశమైంది. విజయ్ ఇటీవలే తన రాజకీయ పార్టీని ప్రారంభించాడు. పార్టీ పేరు తమిళ వెట్రి కజగం. 2026లో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన పార్టీని బరిలోకి దించనున్నారు విజయ్. దాంతో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చింది. దళపతి విజయ్ చివరి చిత్రం పొలిటికల్ సెటైర్ గా ఉంటుందని అంటున్నారు. రాజకీయాల్లోకి రాకముందే పెద్ద హిట్ కొట్టేందుకు పూర్తి సన్నాహాలు చేసుకుంటున్నారు. దళపతి 69 చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించబోతున్నారని గతంలో టాక్ వచ్చింది.

కమిట్‌మెంట్స్ కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించలేరని ఇప్పుడు తెలుస్తోంది. అయితే అతని స్థానంలో ఇద్దరు పెద్ద దర్శకుల పేర్లు వస్తున్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి టాలీవుడ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపీస్తున్నాయి. మరో దర్శకుడు హెచ్ వినోద్. ఈ ఇద్దరిలో ఒకరి పేరు మాత్రమే ఖరారు కానుంది. దళపతి విజయ్ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారని. అలాగే ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించనున్నారని ప్రచారం జరుగుతుంది. అలాగే ఈ సినిమాను దాదాపు 1000కోట్ల తో తెరకెక్కించే ఛాన్స్ ఉందంటూ కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.