Site icon HashtagU Telugu

Sukumar: రాజమౌళి సార్.. మీకూ మాకు ఒకటే తేడా!

Sukumar

Sukumar

రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మూవీ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరుగరాస్తోంది. ఈ సినిమా దేశమంతటా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ కు సినీ అభిమానులే కాకుండా, టాలీవుడ్ హీరోలు, దర్శకులు సైతం ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫుష్ప ఫేం డైరెక్టర్ సుకుమార్ సైతం ఆర్ఆర్ఆర్ మూవీ పట్ల తనకున్న ఇష్టాన్ని చాటుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా జక్కన్నను పొగడ్తలతో ముంచేశాడు.

‘‘మీరు పక్కనే ఉన్నా

మిమ్మల్ని అందుకోవాలంటే

పరిగెత్తాలి..

మేం ఆకాశంలో ఉన్నా

మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి..

రాజమౌళి సార్.. మీకు మాకు ఒకటే తేడా..

ఇలాంటి సినిమా మీరు తీయగలరు.. మేం చూడగలం అంతే’’ అంటూ పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సుకుమార్ డైరెక్టర్ గా పుష్ప సినిమా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాజమౌళి కూడా సుకుమార్ ను ఓ రేంజ్ లో మెచ్చుకోవడం విశేషం. తెలుగు దర్శకులు ఒకరునొకరు పొగుడుకోవడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Exit mobile version