Site icon HashtagU Telugu

Puri Next With Salman? సల్లుభాయ్ తో పూరి సినిమా!

Puri

Puri

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘లైగర్’తో మనముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా పూరికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఒకటి బయటకొచ్చింది. సల్మాన్ ఖాన్ కోసం రూపొందించిన స్క్రిప్ట్ తన వద్ద ఉందని చెప్పాడు. ఇప్పటి వరకు వీరిద్దరు కలిసి పనిచేయలేదు. కానీ లైగర్ విజయంతో పూరీ సల్మాన్ ఖాన్‌ను డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయి. కానీ సల్మాన్, పూరీ ఇద్దరూ బ్లాక్ బస్టర్ ‘పోకిరి’ (2006)కి రీమేక్ అయిన ‘వాంటెడ్’ (2009) సినిమాతో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.

“వాంటెడ్‌ విడుదలైనప్పటి నుంచి సల్మాన్‌ సర్‌తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాను. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. ఏదో ఒక రోజు అతనికి దర్శకత్వం వహించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా” అని పూరి అన్నారు. చాలా మంది బాలీవుడ్ నటీనటులతో కలిసి పనిచేయాలని పదేళ్ల ప్రణాళికతో ఉన్నానని చెప్పాడు. ఆయన తదుపరి చిత్రం విజయ్ దేవరకొండతో జనగణమన చేయబోతున్నారు.  “నేను రణబీర్ కపూర్, రణవీర్, వరుణ్ ధావన్‌లతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. నేను ఖాన్‌లందరినీ ప్రేమిస్తున్నాను, కానీ నేను సల్మాన్ సర్‌తో సినిమా చేయాలనుకుంటున్నాను’’ అంటూ మనసులో కోరిక బయటపెట్టాడు పూరి.