Site icon HashtagU Telugu

Puri Assistant Suicide: పూరి జగన్నాధ్ ‘అసిస్టెంట్ డైరెక్టర్’ ఆత్మహత్య

Puri

Puri

ఆర్థిక ఇబ్బందులతో సాయి కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని దుర్గం చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో పూరీ జగన్నాధ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినట్టు సమాచారం. దుర్గం చెరువులో గుర్తుతెలియని యువకుడి మృతదేహంపై మాదాపూర్ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.

మృతుడికి సుమారు 35 ఏళ్లు, ఎరుపు రంగు టీషర్ట్, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు విచారణ చేపట్టగా మృతుడు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొత్తగూడకు చెందిన సాయికుమార్‌గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ప్రాణాలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. గతంలో దర్శకుడు పూరీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగం వెతుక్కుంటూ ఆర్థిక ఇబ్బందులతో సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

Exit mobile version