Site icon HashtagU Telugu

Avatar And RRR: టాలీవుడ్ క్రేజ్.. అవతార్ డైరెక్టర్ తో ‘ఆర్ఆర్ఆర్’ డైరెక్టర్!

Rajamouli And James Cameron

Rajamouli And James Cameron

ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ ఖ్యాతి విదేశాలకు సైతం పాకింది. ఇప్పటికే ఎన్నో అవార్డులను కొల్లగొట్టిన ఈ మూవీకి ప్రపంచ దిగ్గజాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రసిద్ధ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత జేమ్స్ కామెరాన్ తో మరో దిగ్గజ దర్శకుడైన ఎస్ఎస్ రాజమౌళి భేటీ అయ్యారు. రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను (RRR) జేమ్స్ కామెరాన్ (James Cameron) ప్రశంసించాడు. ఈ క్రమంలో కామెరాన్, రాజమౌళి వీరిద్దరూ ఒకేచోట కలుసుకుని ముచ్చటించుకున్నారు.

రాజమౌళి (Rajamouli) ట్విట్టర్ లో పలు ఫొటోలు ఉంచారు. అవతార్ డైరెక్టర్ తనతో 10 నిమిషాల సమయం వెచ్చించి, సినిమా గురించి చర్చిస్తారని అనుకోలేదంటూ పోస్ట్ పెట్టారు. ‘‘గ్రేట్ జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ (RRR) ను చూశారు. సినిమా ఆయనకు ఎంతో నచ్చడమే కాకుండా, ఆ సినిమాను వీక్షించాలంటూ భార్య సుజీకి సూచించి, ఆయన కూడా ఆమెతో కలిసి మరోసారి చూశారు. ‘సర్ మీరు మాతో 10 నిమిషాల సమయం వెచ్చించి, మా సినిమా గురించి విశ్లేషిస్తారని అనుకోలేదు. మీరన్నట్టు, నేనిప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీ ఇద్దరికీ ధన్యవాదాలు’’ అంటూ రాజమౌళి ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. కామెరాన్ తో ముచ్చటిస్తున్న ఫొటోలను సైతం ఉంచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.

Also Read: Sushmita Konidela: నాన్నగారిని చూస్తుంటే పండగలా ఉంది : సుస్మిత కొణిదెల