Tollywood War: టాలీవుడ్ లో వర్గ పోరు.. చెర్రీ బర్త్ డే వేడుకలకు బన్నీ, ఎన్టీఆర్ డుమ్మా!.

టాలీవుడ్ (Tollywod)లో వర్గపోరు నెలకొందా? జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య గ్యాప్ ఏర్పడిందా?

  • Written By:
  • Updated On - March 29, 2023 / 02:17 PM IST

పుష్ప (Pushpa), ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాలతో సత్తా చాటిన టాలీవుడ్ (Tollywod)లో వర్గపోరు నెలకొందా? జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య గ్యాప్ ఏర్పడిందా? మెగా ఫ్యామిలీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దూరంగా ఉంటున్నారా? టాలీవుడ్ లో తారల మధ్య వర్గపోరు నడస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాల ద్రుష్ట్యా హీరోల మధ్య మరింత గ్యాప్ ఏర్పడినట్టు స్పష్టంగా తెలుస్తోంది. రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

తండ్రి, మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పార్టీని ఏర్పాటు చేసి ఆస్కార్‌ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ టీం సభ్యులు అయిన రాజమౌళి, MM కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, ఇతర ఆర్టిస్టులను సన్మానం చేశారు. అయితే ఆ పార్టీకి ఎన్టీఆర్ హాజరుకాలేదు. అంతేకాదు.. రామ్ చరణ్‌కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపినప్పటికీ, బర్త్ డే పార్టీకి దూరంగా ఉన్నాడు. అయితే ఆస్కార్ ఈవెంట్‌కు ముందు “RRR” స్టార్స్ రామ్ చరణ్ (Ram charan), జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఏర్పడిందని పెద్ద ఎత్తున రుమార్స్ వినిపించాయి. వీరిద్దరి మధ్య గ్యాప్ ఉన్నట్టు చాలా సందర్భాల్లో బయట కూడా పడింది.

ఇప్పటికే ఈ ఇష్యూ కొనసాగుతుంటే.. తాను మెగా కాంపౌండ్‌లో భాగం కాదని అల్లు అర్జున్ మరోసారి స్పష్టం చేశాడు. తనకంటూ ఓ ప్రత్యేకత ఉందంటూ ప్రిరిలీజ్ వేడుకల్లో పరోక్షంగా చెప్పిన సందర్భాలున్నాయి. మెగా ఫ్యామిలీకి విధేయత చూపాల్సిన అవసరం తనకు లేదని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, “పుష్ప 2” దర్శకుడు సుకుమార్ ఈ పార్టీకి హాజరయ్యారు. కానీ అల్లు అర్జున్ మాత్రం (Ram charan) బర్త్ డే పార్టీకి రాలేకపోయాడు. ఈ సంఘటనలన్నీ టాలీవుడ్ లో వర్గపోరుకు దారితీస్తున్నాయని కొందరు పెద్దలతో పాటు అభిమానులు సైతం చర్చించుకుంటున్నారు.

Also Read: CM KCR: రైతుల ఖాతాల్లోకే 10 వేల నష్టపరిహారం: కేసీఆర్ ఆదేశం