Site icon HashtagU Telugu

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కి సెలబ్రిటీస్ ట్వీట్స్.. గేమ్ ఛేంజర్, మాన్ ఆఫ్ ది మ్యాచ్..

Tollywood Celebrities Tweets On Pawan Kalyan Success

Tollywood Celebrities Tweets On Pawan Kalyan Success

Pawan Kalyan : ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. ఈ ఎన్నికల్లో కూటమిగా వెళ్లిన టీడీపీ, జనసేన, బీజేపీ భారీ మెజారిటీతో ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంట్ సీట్స్ ని కైవసం చేసుకుంది. ఇక ఈ కూటమి విజయంలో ముఖ్య పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్.. పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక పవన్ గెలుపుతో సినీ పరిశ్రమ సంబరాలు జరుపుకుంటుంది.

హరీష్ శంకర్ లాంటి దర్శకులు షూటింగ్ సెట్స్ లో టపాసులు పేలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే.. మిగిలిన హీరోలు, దర్శకనిర్మాతలు, యాక్ట్రెస్ లు సైతం సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ పవన్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. పవన్ ని గేమ్ ఛేంజర్, మాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటూ ట్వీట్స్ చేస్తున్న ఆ సెలబ్రిటీస్ ఎవరో ఓ లుక్ వేసేయండి.