Site icon HashtagU Telugu

Virat Kohli : అత్యధిక శతకాలతో రికార్డ్ సృష్టించిన కోహ్లీ.. టాలీవుడ్ స్టార్స్ అభినందనలు..

Virat Kohli Record

Virat Kohli Record

వన్డే క్రికెట్ లో ఇన్నేళ్లు అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) మొదటి స్థానంలో ఉన్నారు. సచిన్ 452 ఇన్నింగ్స్ లో 49 శతకాలు సాధించారు. ఈ రికార్డ్ ని ఎవ్వరూ బ్రేక్ చేయలేరు అనుకున్నారు. కానీ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఈ రెకార్డ్ ని బ్రేక్ చేశాడు. నవంబర్ 5న విరాట్ తన పుట్టిన రోజు నాడు వరల్డ్ కప్ లో తన 49వ సెంచరీ చేసి సచిన్ కి సమంగా నిలిచాడు.

ఇక నిన్న న్యూజిలాండ్ తో జరిగిన సెమి ఫైనల్ లో విరాట్ 50వ సెంచరీ చేసి సచిన్ రికార్డ్ ని బీట్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. నిన్నటి మ్యాచ్ లో ఇండియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ కి అనేకమంది సెలబ్రిటీలు వచ్చి సందడి చేశారు. విరాట్ రికార్డ్ కి అభినందనలు తెలిపారు. ఇక టాలీవుడ్ ప్రముఖులు కూడా విరాట్ ని అభినందిస్తూ ట్వీట్స్ వేశారు.

Also Read : NZ vs IND Semifinal : టీమిండియా చారిత్రాత్మక విజయం..న్యూజిలాండ్ ను చావుదెబ్బ కొట్టిన షమీ