Tollywood తెలుగులో చమ్మక్ చల్లో సినిమాతో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో ఆడియన్స్ లో ఐడెంటిటీ సంపాదించాడు. అసలే టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ (Character Arist) ల కొరత ఉండటం వల్ల శ్రీకాంత్ కి వరుస అవకాశాలు వచ్చాయి. 10 ఏళ్ల కెరీర్ లో దాదాపు 70 నుంచి 80 సినిమాల దాకా నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ ఈ ఇయర్ ఏకంగా ఎనిమిది సినిమాల్లో నటించారు. పాత్ర నిడివి ఎంత ప్రాధాన్యత ఉందా లేదా అన్నది కాదు ఛాన్స్ వచ్చినా చేశామా అన్నట్టుగా కెరీర్ కొనసాగిస్తున్నారు.
రీసెంట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఖుషి (Khushi), కార్తికేయ బెదురులంక సినిమాలో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ రెండు సినిమాల్లో తన పాత్రలతో మెప్పించారు. బెదురులంకలో అతని పాత్రకు మంచి క్రేజ్ వచ్చింది. ఇన్ని సినిమాలు చేసిన ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల్లో ఉంటుందని ఊహిస్తారు. కానీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) తన బ్యాంక్ బ్యాలెన్స్ చూపించి సర్ ప్రైజ్ చేశారు. కేవలం 70 పైసల బ్యాలెన్స్ మాత్రమే అతని ఖాతాలో ఉన్నాయి.
Also Read : Varun-Lavanya: ఇటలీలో వరుణ్-లావణ్యల పెళ్లిసందడి, మెగా ఫ్యామిలీ పిక్స్ వైరల్
టాలీవుడ్ లో ఎంత లేదన్నా వరుస సినిమాలు చేస్తూ వస్తున్న శ్రీకాంత్ అయ్యంగార్ తన అకౌంట్ లో ఒక్క రూపాయ్ లేకుండా ఉండటం ఏంటని ఆడియన్స్ షాక్ అవుతున్నారు. అయితే తన అకౌంట్స్ అన్ని కూడా తమ్ముడు చూసుకుంటాడని తనకు అవసరం ఉన్నప్పుడు అతన్ని అడుగుతా తనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు తను చూసుకుంటాడని అన్నారు శ్రీకాంత్ అయ్యంగార్. సో తమ్ముడికి తన అకౌంట్స్ ఇచ్చి తన ఖాతాలో కేవలం 70 పైసలతో అకౌంట్ నడిపిస్తున్నారు శ్రీకాంత్.
ఒకప్పుడు చాలా కష్టాలు పడిన తనకు ఇప్పుడు డబ్బులు వచ్చినా సరే అదే జీవితాన్ని కొనసాగిస్తున్నానని అన్నారు. డబ్బు వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే తను ఎక్కువగా డబ్బుని ఉంచుకోనని అన్నారు.
We’re now on WhatsApp : Click to Join