Site icon HashtagU Telugu

Block buster Beauty In Dilemma: బ్లాక్ బస్టర్ బ్యూటీకి వరుసగా డిజాస్టర్స్.. ట్రాక్ తప్పిన కృతి!

Kriti

Kriti

తెలుగు తెరపై ఉప్పెనలా ఎగిసిపడ్డ హీరోయిన్ కృతిశెట్టి. ఆ మూవీలో బేబమ్మగా అన్ని వర్గాలను ఆకట్టుకుంది. ఉప్పెనతో ఒక్కసారిగా ఈ బ్యూటీ వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం కృతి కెరీర్ గ్రాఫ్ భయంకరంగా ఉంది. ఇటీవల ఆమె బాక్సాఫీస్ వద్ద ఒక్క హిట్ కూడా సాధించలేక ఇబ్బంది పడుతోంది. కృతి గత మూడు చిత్రాలైన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం, వారియర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. సినిమాలు వరుసగా ఫెయిల్యూర్ కావడంతో కెరీర్ ఇబ్బంది పడే స్థితిలో ఉంది.

బాక్సాఫీస్ అవకాశాలను పక్కన పెడితే, కృతి నటిగా కూడా నిరూపించుకునే పాత్రలు చేయడం లేదని నెటిజన్లు పేర్కొంటున్నారు. కృతి స్క్రిప్ట్‌లను పట్టించుకోకుండా కొత్త ప్రాజెక్ట్‌లకు సైన్ చేసిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె మరింత జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయపడ్డారు. అదృష్టవశాత్తూ కృతికి ఇంకా మంచి అవకాశాలు వస్తున్నాయి. నెక్ట్స్ చేయబోయే సినిమాలతోనైనా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇంక అంతే సంగతులు. కృతి తదుపరి వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య సినిమాలో నటిస్తోంది.

Exit mobile version