Site icon HashtagU Telugu

Tamannaah@Melbourne Stadium: మెల్ బోర్న్ స్టేడియంలో మిల్కీబ్యూటీ ఫోజులు!

Tamannah

Tamannah

ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 2022 సందర్భంగా ప్రత్యేక ఈవెంట్‌ నిర్వహించనున్నారు. దీంతో పలువురు తారలు మెల్‌బోర్న్‌కు వెళ్లారు. తమన్నా భాటియా IFFMకి హాజరు కావడమే కాకుండా తనకు ఇష్టమైన MCG గ్రౌండ్‌లో ప్రత్యేకంగా ఫోటో షూట్ కూడా చేసింది. నారింజ రంగు దుస్తులు ధరించి, భారత క్రికెట్ జట్టులోని పలువురు హీరోలు చరిత్ర సృష్టించిన ఐకానిక్ గ్రౌండ్‌లో నటి పులకించిపోయింది.

ఫోటో షూట్ గురించి తమన్నా వ్యాఖ్యానిస్తూ “ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) 2022లో పాల్గొనడానికి నేను సంతోషిస్తున్నా. మెల్‌బోర్న్‌లో IFFMకి ఇంత గొప్ప ఆదరణ లభించింది. ఇది భారతీయ సినిమా ప్రభావానికి నిదర్శనం. మెల్బోర్న్ నాకు ఇష్టమైన నగరాలలో ఒకటి. ఐకానిక్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఒక ప్రత్యేక ఫోటోషూట్ చేయడానికి ఆహ్వానించబడినందుకు నేను సంతోషిస్తున్నా” అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.