Site icon HashtagU Telugu

Sree Leela with Mahesh Babu: లక్కీ గర్ల్.. మహేష్ పక్కన ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల!

Mahesh And Sreeleea

Mahesh And Sreeleea

పెళ్లిసందడి బ్యూటీ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా గ్లామర్ బ్యూటీగా ముద్ర పడటంతో ఆఫర్స్ వస్తున్నాయి. ఈ బ్యూటీ అందానికి తెలుగు ప్రేక్షకుల ఫిదా అయ్యారు. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ సరసన ధమాకా సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత కుర్ర హీరోల సరసన నటిస్తుంది శ్రీలీల. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మకు ఓ భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమాలో శ్రీలీలకు ఛాన్స్ దక్కిందని టాక్. మహేష్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుందని ఫిలిం సర్కిల్స్ లో వార్త చక్కర్లు కొడుతోంది. మహేష్ సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుంది. అలాగే పూజ చెల్లెలి క్యారెక్టర్ లో శ్రీలీల నటించనున్నదని తెలుస్తుంది.

అయితే ఈ సినిమా ఈ అమ్మడిది చిన్న క్యారెక్టర్ కాదట.. ముందుగా గ్లామర్ కోసం రెండో హీరోయిన్ రోల్ ని క్రియేట్ చేసారట. కానీ ఇప్పుడు కథలో మార్పులు చేస్తున్నారట. కొన్ని కీలక సీన్స్ లో నటించే అవకాశం ఉన్నాయని తెలుస్తోంది. ఈ యంగ్ బ్యూటీ మహేష్ సినిమాలో కీలకం కానుందని టాలీవుడ్ టాక్ కూడా. త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ అయినా తగినంత గుర్తింపు కచ్చితంగా ఉంటుంది. గత త్రివిక్రమ్ మూవీస్ లో సెకండ్ హీరోయిన్స్ కూడా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.