Site icon HashtagU Telugu

Samantha Part Of ‘Pushpa 2’: క్రేజీ ఆప్డేట్.. పుష్ప-2లో సమంత.. ఫుష్పరాజ్ ఫ్రెండ్ గా!

Screen Shot 2021 12 10 At 7.23.11 Pm Imresizer

samantha

స్టార్ నటి సమంత ‘పుష్ప 2’లోని ‘ఊ అంటావా’ సాంగ్‌లో గ్లామర్ ట్రీట్‌తో చాలా పాపులారిటీ సంపాదించింది. ఈ పాట దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో నిలిచింది. సమంతా అద్భుతమైన లుక్‌లు అభిమానులను పిచ్చెక్కించాయి. అయితే సమంత  పుష్ప-2 లో కూడా నటించవచ్చు అనే వార్తలొస్తున్నాయి. మొదటి భాగంలో ఐటెం సాంగ్‌లో అలరించిన ఆమెకు రెండవ భాగంలో పుష్ప రాజ్‌కి సహాయం చేసే స్నేహితురాలిగా నటింపజేయాలని డైరెక్టర్ సుకుమార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మొదటి భాగం చివర్లో బన్నీ పాత్రతో పెళ్లి చేసుకున్న రష్మిక సినిమా ప్రారంభమైన మొదటి 20 నిమిషాల్లోనే చనిపోతుందని టాలీవుడ్ టాక్. శ్రీవల్లి పాత్ర చివరి వరకు ఉంటుందని మరొకొన్ని వార్తలు వినిపించాయి. సమంత షెకావత్ పాత్రకు విరుద్ధంగా నటించే పాత్రలో కనిపించే అవకాశాలున్నాయట. పుష్ప’ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న మూవీ ఇండియన్ స్థాయిలో విడుదలైంది. తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోకి డబ్ చేయబడింది. ఈ చిత్రంలో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించగా, భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ నటించారు. అజయ్ ఘోష్, సునీల్, అనసూయ వంటి నటీనటులు నెగిటివ్ క్యారెక్టర్స్ తో అలరించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, మైత్రీ మూవీ మేకర్స్ రెండు భాగాలను నిర్మిస్తోంది.