Kill : బాలీవుడ్‌లో అదరగొడుతున్న ‘కిల్’.. అఖిల్ రీమేక్ చేస్తే పర్ఫెక్ట్ అంటున్న నెటిజెన్స్..

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొడుతున్న 'కిల్'. ఇక ఈ మూవీని చూసిన కొందరు టాలీవుడ్ ఆడియన్స్.. ఈ సినిమాని అఖిల్ రీమేక్ చేస్తే పర్ఫెక్ట్ అవుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Akhil Akkineni, Kill Movie, Naga Chaitanya, Nagarjuna

Akhil Akkineni, Kill Movie, Naga Chaitanya, Nagarjuna

Kill : యాక్షన్ సినిమాలకు ఆడియన్స్ లో ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. ఇక ఆ ఆదరణకు తగ్గట్లే ఫిలిం మేకర్స్ జనరేషన్ కి అనుగుణంగా సినిమాలు తెరకెక్కిస్తుంటారు. ఈక్రమంలోనే ప్రస్తుతం ఉన్న దర్శకులు.. ఒక చిన్న ఎమోషన్ చుట్టూ అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలను చూపిస్తూ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్నారు. హాలీవుడ్ ‘జాన్ విక్’ మూవీ ఈ తరహాలో వచ్చే.. ఆడియన్స్ నుంచి ఎంతో ఆదరణ అందుకుంది. ఇక ఇండియాలో అయితే ఈ టైపు ఆఫ్ ఫిలిం మేకింగ్ కి లోకేష్ కనగరాజ్ సరైన ఉదాహరణ. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా ఈ తరహాలోనే వచ్చాయి.

ఇక తాజాగా బాలీవుడ్ లో ఆ తరహా సినిమా ఒకటి వచ్చింది. నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వంలో లక్ష్య హీరోగా తెరకెక్కిన ‘కిల్’ అనే యాక్షన్ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొడుతుంది. ఇండియన్ ఆర్మీ సైనికుడైన హీరో రైలు ప్రయాణం చేస్తుండగా.. ఒక క్రూరమైన దొంగల ముఠా ప్రయాణికుల పై దాడి చేస్తారు. ఇక వారిపై హీరో చేసిన మారణహోమమే కిల్ సినిమా. గంటా నలబైదు నిముషాలు పాటు ఆడియన్స్ ని థియేటర్ సీట్ చివరన కూర్చునేలా చేసి అదుర్స్ అనిపిస్తుంది. ఈ మూవీ హిందీలో మాత్రమే రిలీజ్ అయ్యింది. ఇక ఈ మూవీని చూసిన కొందరు టాలీవుడ్ ఆడియన్స్.. ఈ సినిమాని అఖిల్ రీమేక్ చేస్తే పర్ఫెక్ట్ అవుతున్నారు.

అఖిల్ కటౌట్‌కి ఈ సినిమా బాగా సెట్ అవుతుందని చెబుతున్నారు. అఖిల్ కి ఇప్పటివరకు ఓ సరైన సినిమా పడలేదు. ఒకవేళ అఖిల్ ఈ సినిమా చేస్తే.. కచ్చితంగా పెద్ద హిట్ అందుకుంటాడని జోష్యం చెబుతున్నారు. ఏజెంట్ డిజాస్టర్ తరువాత అఖిల్ సైలెంట్ అయ్యిపోయారు. ఇప్పటివరకు మరో సినిమాని అనౌన్స్ చేయలేదు. మరి ఆడియన్స్ నుంచి వస్తున్న ఈ రిక్వెస్ట్ ని గమనించి.. అఖిల్ ఈ సినిమాని రీమేక్ చేసే ఆలోచన ఏమైనా చేస్తారా అనేది చూడాలి.

  Last Updated: 15 Jul 2024, 01:48 PM IST