Sreemukhi : శ్రీముఖి ఫిలిం ఇండస్ట్రీలోకి ఎలా వచ్చిందో తెలుసా..?

టాలీవుడ్ యాంకర్ కమ్ యాక్టర్ శ్రీముఖి.. తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపుని, ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నారు. అయితే అసలు శ్రీముఖి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు..?

Published By: HashtagU Telugu Desk
Tollywood Anchor And Actress Sreemukhi Entry To Film Industry

Tollywood Anchor And Actress Sreemukhi Entry To Film Industry

Sreemukhi : టాలీవుడ్ యాంకర్ కమ్ యాక్టర్ శ్రీముఖి.. తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపుని, ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నారు. టీవీ షోలతో గుర్తింపుని సంపాదించుకున్న శ్రీముఖి.. హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. అయితే అసలు శ్రీముఖి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు..? వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఇండస్ట్రీ వ్యక్తులు ఉన్నారా..? ఈ ప్రశ్నలకు సమాధానాలు శ్రీముఖినే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

శ్రీముఖి నిజామాబాద్ లో జన్మించారు. వాళ్ళ కుటుంబానికి సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదు. శ్రీముఖి ఫాదర్ ఒక సాధారణ ఎంప్లాయ్, ఇక మదర్ ఏమో చిన్న బ్యూటీ పార్లర్ నడిపేవారు. అయితే ఒక షో కోసం ఈటీవీ ఛానల్ వారు నిజామాబాద్ వచ్చారట. హౌస్ వైఫ్స్ అండ్ లేడీస్ పై ఆ షోని చిత్రీకరిస్తున్నారు. ఈక్రమంలోనే శ్రీముఖి మదర్ నడుపుతున్న బ్యూటీ పార్లర్ గురించి తెలుసుకున్న ఈటీవీ మానేజ్మెంట్.. ఆమెతో ఒక ఎపిసోడ్ ప్లాన్ చేశారట. ఆ సమయంలోనే శ్రీముఖి ఫ్యామిలీ మెంబెర్స్ గురించి కూడా షోలో చూపించారు.

ఇక ఆ షో చిత్రీకరణ సమయంలో శ్రీముఖిని చూసిన ఈటీవీ వాళ్ళు.. శ్రీముఖి చాలా బాగుంది. టీవీలో చేస్తుందా..? అని అడిగారట. అయితే శ్రీముఖికి అప్పుడు ఇంటరెస్ట్ లేదు, అసలు యాక్టింగ్ అండ్ హోస్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. దీంతో శ్రీముఖి.. నాకు ఏమి తెలియదని సమాధానం చెప్పారట. ఈటీవీ వాళ్ళు ఇచ్చిన ఆ ఆఫర్ ని శ్రీముఖి ఫాదర్ కూడా ఒప్పుకోలేదు. కానీ శ్రీముఖి మదర్ కి మాత్రం.. తన కూతుర్ని టీవీలో చూసుకోవాలని ఆశ కలిగింది.

దీంతో తన భర్తతో ఆరు నెలలు పోరాడి.. శ్రీముఖి టీవీ షో చేయడానికి ఒప్పించారు. అలా టీవీలో వచ్చే ‘అదుర్స్’ అనే రియాలిటీ షోకి శ్రీముఖి హోస్ట్ గా చేసారు. శ్రీముఖితో పాటు ప్రదీప్ ఆ షోని హోస్ట్ చేసారు. అయితే శ్రీముఖి ఈ షోతోనే మొదటిసారి కెమెరా ముందుకు వచ్చారు. కానీ ఆడియన్స్ కి పరిచయమైంది మాత్రం ఈ షోతో కాదు. టీవిలో ఈ షో ప్రసారం లేటు అవ్వడంతో ‘జులాయి’ సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లిగా నటించి శ్రీముఖి ఆడియన్స్ కి పరిచయమయ్యారు. ఆ తరువాత ఈ షోతో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు.

  Last Updated: 10 May 2024, 07:00 PM IST