Site icon HashtagU Telugu

Actress Punarnavi Bhupalam: ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ నటి.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

Actress Punarnavi Bhupalam Health Issues Detailsa

Actress Punarnavi Bhupalam Health Issues Detailsa

Actress Punarnavi Bhupalam: న్యూ ఇయర్ ప్రారంభంలోనే బిగ్ బాస్ పునర్నవి భూపాలం తన అభిమానులకు బ్యాడ్ న్యూస్ తెలిపింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొంది. తన నూతన సంవత్సరం చెస్ట్ కన్జెషన్ తో మొదలైందని, తాను అనారోగ్యం బారిన పడటం ఇదే చివరిసారి అని కోరుకుంటున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొంది.

పునర్నవి ఇన్‌స్టాగ్రామ్ పోస్టు చూసి నెటిజన్లు దిగ్భాంతి వ్యక్తం చేస్తుున్నారు. త్వరగా కోలుకుని ఆరోగ్యంతో బయటకు రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల బారిన పడినవారికి విపరీతమైన దగ్గుతో పాటు ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆమె త్వరలో కోలుకుంటుందంటూ అందరూ ఆశిస్తున్నారు.

బిగ్ బాస్3లో పునర్నవి పాల్గొంది. ఆ సీజన్ లో ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేసింది. ఆ సీజన్ లో బిగ్ బాస విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమ వ్యవహారం నడిపిందనే వార్తలు వచ్చాయి. వారిద్దరూ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది. కానీ తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని, లవ్ లాంటివి ఏమీ లేదని రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి క్లారిటీ ఇవ్వడంతో.. ఆ వార్తలకు చెక్ పడ్డాయి. బిగ్ బాస్ స్క్రీఫ్ట్ ప్రకారమే వారిద్దరూ ప్రేమ వ్యవహారం నడిపారని, బయటకు వచ్చిన తర్వాత ఎవరి దారి వాళ్లు చూసుకున్నారనే చర్చ జరిగింది.

పునర్నవి చాలా చిన్న వయస్సులోనే ఇండస్ట్రీకి వచ్చింది. 2013లో ఉయ్యాలా జంపాలా సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ చ ేసింది. అనంతరం బిగ్ బాస్ షోకు కంటెస్టెంట్ గా వచ్చి ప్రేక్షకులకు మరింత పరిచయం అయింది. బిగ్ బాస్ తర్వాత ఆమెకు చాలా ఆఫర్స్ వచ్చాయి. ఎందుకు ఎమో, ఒక చిన్న విరామం, సైకిల్ వంటి సినిమాల్లో పునర్నవి నటించింది.