Site icon HashtagU Telugu

Actress Sowmya Shetty Arrested : హీరోయిన్ బంగారం చోరీ కేసులో ట్విస్ట్.. వెనక ఉన్న వ్యక్తులు ఎవరు..?

Tollywood Actress Sowmya Shetty Arrested In Theft Case Vishakapatnam

Tollywood Actress Sowmya Shetty Arrested In Theft Case Vishakapatnam

Actress Sowmya Shetty Arrested వైజాగ్ సినీ నటి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ సౌమ్య శెట్టి తన స్నేహితురాలు మౌనికా దగ్గర 100 తులాల బంగారం చోరీ చేసిన కేసులో ఆమెకు వైజాగ్ పోలీసులు 15 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

మౌనికకు సంబందించిన 100 తులాల బంగారాన్ని సౌమ్య కాజేసిందని.. స్నేహం పేరుతో మోసం చేసిందని.. లేడీ కాదు సౌమ్య శెట్టి ఖిలాడి అంటూ రకరకాల కథనాలు వచ్చాయి. అయితే ఈ కేసు విషయంలో మరో కోణం ఉందని దాని వెనక పెద్దల హస్తం ఉందని అంటున్నారు.

సౌమ్య శెట్టిని కావాలనే ఈ కేసులో ఇరికించారని తెలుస్తుంది. సౌమ్యా తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకునేందుకు తగిన ఆధారాలు అన్నీ కూడా సౌమ్య శెట్టి దగ్గర ఉన్నాయని తెలుస్తుంది. కోర్టులో ఆమె ఆధారాలు సమర్పించాలని అనుకుంటుందని తెలుస్తుంది.

కావాలని ఒక ప్లానింగ్ తో ఆమెను ఈ కేసులో ఇరికించారని.. సౌమ్య శెట్టి దగ్గర వాటికి సంబందించిన అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని అంటున్నారు. ఇంతకీ అసలు సౌమ్య శెట్టి మౌనికల మధ్య కేవలం ఈ బంగారం గొడవేనా మరొకటి ఏదైనా ఉందా..? సౌమ్య శెట్టి చోరీ విషయంలో బయటకు రావాల్సిన వాస్తవాలు ఏంటి..? అవి ఎప్పుడు బయటకు వస్తాయన్నది తెలియాల్సి ఉంది.

ఈ కేసు నిగూడ రహస్యం వీడాలంటే సౌమ్య శెట్టి నోరు విప్పాల్సిందే. అయితే మీడియా మాత్రం సౌమ్యా శెట్టిని ధోషిగా చూపిస్తూ కథనాలు ప్రచారం చేస్తుంది. కొంతమంది సౌమ్య శెట్టి తనకు తానే స్వయంగా బంగారం చోరీ చేసినట్టు ఒప్పుకుందని కూడా కథనాలు రాస్తున్నారు. అయితే ఈ కేసు పూర్తి డీటైల్స్ కోర్టులో హియరింగ్ కు వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుందని చెప్పొచ్చు.