Site icon HashtagU Telugu

Mrunal Thakur: రిలేషన్ షిప్ పై అలాంటి కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్.. ఇద్దరు పిల్లల్ని కనాలని ఉందంటూ?

Tollywood Actress Mrunal Thakur Crazy Comments About Relationship

Tollywood Actress Mrunal Thakur Crazy Comments About Relationship

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మృణాల్‌ ఠాకూర్‌ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా సీతారామం. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించి ఈ మూవీ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో ఊహించని విధంగా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాతో హిట్ టాక్ ని తన ఖాతాలో వేసుకుంది. సీతారామం సినిమాలో సీతగా అద్భుతంగా నటించి యూత్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఈ సినిమా తర్వాత ఆమె నటించిన హయ్ నాన్న సినిమా కూడా మంచి సక్సెస్ ను సాధించింది. ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ మన ఆడియెన్స్ ను అలరిస్తూ మరింతగా దగ్గరవుతూనే వస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈమె స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ మూవీలో కలిసి నటించింది. ఈ ఫ్యామిలీ స్టార్ చిత్రం ఏప్రిల్ 5న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజ్ నిర్మించగా.. గోపీ సుందర్ సంగీతం అందించారు. పరుశు రామ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తన సినిమా రిలీజ్ కాబోతున్న సందర్బంగా మృణాల్ ఠాకూర్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతోంది.

రీసెంట్ గా ఒక ఛానెల్ లో మాట్లాడిన మృణాల్ తన రిలేషన్ షిప్, సెలబ్రెటీలు ఎదుర్కొనే సమస్యలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను ఎవరితోను రిలేషన్ షిప్ లేను. రిలేషన్ లో ఉన్న వారు మాత్రం ఆ ప్రేమను మరింత పెంచేందుకు ప్రయత్నించాలి. ఇద్దరూ నమ్మకంగా ఉండాలి. అప్పుడు ఆ బంధం మరింత బలపడుతుంది, నిలబడుతుంది కామెంట్స్ చేసింది.
అలాగే సెలబ్రెటీలుగా ఉండటం చాలా కష్టం. ఎప్పుడూ షూటింగ్స్ లో ఉండి కుటుంబీలకు దూరమవ్వాల్సి వస్తుంది. నాకు నార్మల్ లైఫ్ గడపాలని ఉంటుంది. ఇద్దరు పిల్లల్ని కని వారితో కలిసి డిన్నర్ కి వెళ్తే ఎంత బాగుంటుందో అని చెప్పుకొచ్చింది మృణాల్.