Kalpika : టాలీవుడ్ నటి కల్పిక మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. హైదరాబాద్ అవుట్‌స్కర్ట్స్‌లోని మొయినాబాద్ – కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో ఆమె ప్రవర్తన చర్చనీయాంశమైంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్‌లో ఒంటరిగా రిసార్ట్‌కు చేరుకున్న కల్పిక, రిసెప్షన్‌లోకి వెళ్ళగానే మేనేజర్ కృష్ణతో ఘర్షణకు దిగినట్లు సిబ్బంది చెబుతున్నారు.
మెనూ కార్డు విసిరేయడం, రూమ్ కీస్‌ను మేనేజర్ ముఖంపై పడేయడం, అసభ్య పదజాలంతో బూతులు తిట్టడం వంటి ప్రవర్తనతో ఆమె రిసార్ట్ సిబ్బందిని షాక్‌కు గురిచేసిందని సమాచారం. సిగరెట్లు తెమ్మన్న డిమాండ్ కూడా సిబ్బందిని ఇబ్బందిపెట్టిందని అంటున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు రిసార్ట్ ప్రాంగణంలో కల్పిక చేసిన హంగామా కారణంగా ఇతర అతిథులు అసౌకర్యానికి గురయ్యారని సిబ్బంది ఆరోపిస్తున్నారు.
Khaleel Ahmed: ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన భారత ఫాస్ట్ బౌలర్!
ఆమె ప్రవర్తనలో ఏదో మానసిక ఒత్తిడి లేదా వ్యక్తిగత సమస్య ఉందేమో అన్న అనుమానాలు రిసార్ట్ సిబ్బందిలో వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఆరోపణలపై కల్పిక స్పందిస్తూ తన వైపు కథను చెప్పింది.
“రిసార్ట్‌లోని సిబ్బంది నన్ను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు. నేను హంగామా చేయలేదు. వారు నా పట్ల దురుసుగా ప్రవర్తించారు. క్యాబ్ సదుపాయం లేదు, వైఫై కూడా సరిగా పనిచేయలేదు. సిగరెట్ తెమ్మన్నా తెచ్చిపెట్టలేదు.
నా అవసరాలను పట్టించుకోకపోవడంతో కోపంతో కొందరిని తిట్టాను. దాన్ని పెద్దదిగా చేసి, తప్పుడు రీతిలో చూపిస్తున్నారు. పోలీసులు ఒక వేరే కేసులో నన్ను వేధిస్తున్నారు. ఓదార్పు కోసం రిసార్ట్‌కి వెళ్ళాను. కానీ అక్కడ కూడా సమస్యలు మొదలయ్యాయి. ఎవరికీ ఇబ్బంది కలిగించాలన్న ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళలేదు,” అని కల్పిక వివరణ ఇచ్చింది. ప్రస్తుతం రిసార్ట్ సిబ్బంది ఈ ఘటనపై అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
Arshdeep Singh: ఇంగ్లాండ్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. వీడియో వైరల్!