Kajal Aggarwal: పెళ్లి అయినా ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న కాజల్.. ఫోటోస్ వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాజల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కాజల్. కళ్యాణ్ రామ్ హీరోగా 2007లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ కాజల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత 2009లో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ […]

Published By: HashtagU Telugu Desk
Mixcollage 17 Feb 2024 10 02 Am 1757

Mixcollage 17 Feb 2024 10 02 Am 1757

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాజల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కాజల్. కళ్యాణ్ రామ్ హీరోగా 2007లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ కాజల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత 2009లో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ దెబ్బకు కాజల్ కు టాలీవుడ్ లో మంచి బ్రేక్ వచ్చి పడింది. దాంతో ఈ చిన్నదాని క్రేజ్ పెరిగిపోయింది.

ఆ తర్వాత మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది కాజల్. 2010లో ఈమె తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ సరసన నా పేరు శివ చిత్రంలో నటించింది. ఈ సినిమా తో కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్ భాషలతో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది కాజల్ అగర్వాల్. ఇకపోతే కాజల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని 2020లో కరోనా లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి 2022 ఏప్రిల్ 19న మ‌గ‌బిడ్డ జన్మించాడు. ఆ సమయంలో సినిమాకు బ్రేక్ ఇచ్చింది కాజల్.

ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన కాజల్ ప్రస్తుతం వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీగా మారింది. ఇటీవలే బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి సినిమాలో నటించింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే కాజల్ పెళ్లి అయ్యి బాబు ఉన్నప్పటికి ఆమె అందం ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ మేరకు తాజాగా కాజల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలను చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పెళ్లి అయినప్పటికి కాజల్ అందం ఏ మాత్రం తగ్గలేదు. వయసుతో సంబంధం లేకుండా తన అందరిని మరింత పెంచుకుంటూ ఈ తరం హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తోంది.

  Last Updated: 17 Feb 2024, 10:03 AM IST