Site icon HashtagU Telugu

Ananya Nagalla : నా వివాహం ఎప్పుడో చెప్పండి.. టాలీవుడ్ న‌టి ట్వీట్ వైర‌ల్‌.!

Ananya Nagalla

Ananya Nagalla

టాలీవుడ్‌కు న‌టి అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మ‌ల్లేశం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అన అందాల‌తో అభిమానుల‌కు ఆక‌ట్టుకుంటుంది. అన‌న్య‌ మల్లేశం మూవీ త‌ర్వాత‌ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో న‌టించి యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ అందాలతో కుర్రకారును మాయచేస్తోంది.

అయితే ఈ అమ్మడిపై ఈ మ‌ధ్య ఓ న్యూస్ సోష‌ల్‌మీడియాలో హల్‌చ‌ల్ చేస్తోంది. ఆ న్యూస్ ఏంటంటే.. అన‌న్య ఓ స్టార్‌ ప్రొడ్యూసర్ కొడుకును పెళ్లి చేసుకోబోతున్నట్టు సోష‌ల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దీనిపై అనన్య ట్విట్టర్ ద్వారా త‌న స్పంద‌న తెలియ‌జేసింది.

‘నా కోసం వరుడిని ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు. కానీ.. అతనేవరో, నా వివాహం ఎప్పుడో నాకు కూడా చెప్పండి ప్లీజ్‌. లేకపోతే నా పెళ్లికి నేను రాలేను’ అంటూ అన‌న్య ఆ ట్వీట్‌లో రాసుకొచ్చింది. అయితే అన‌న్య చేసిన ఈ ట్వీట్ ప్ర‌స్తుతం వైర‌ల్ అయ్యింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్స్‌, మీమ్స్ షేర్ చేస్తున్నారు.

Exit mobile version