Srikanth – Hema : రేవ్ పార్టీలో పట్టుబడినట్లు వస్తున్న వార్తలపై శ్రీకాంత్, హేమ రియాక్షన్..

ఈరోజు ఉదయం బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో టాలీవుడ్ నటులు శ్రీకాంత్, హేమ పట్టుబడినట్లు వస్తున్న వార్తలపై వారు స్పదించారు.

Published By: HashtagU Telugu Desk
Tollywood Actors Srikanth Hema Reaction On Bangalore Rave Party

Tollywood Actors Srikanth Hema Reaction On Bangalore Rave Party

Srikanth – Hema : ఈరోజు ఉదయం బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీ.. టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తుంది. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరిలో ఉన్న జీఆర్ ఫామ్‌హౌస్‌‌లో రేవ్ పార్టీ జరుగుతుందన్న విషయం తెలుసుకున్న పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ అధికారులు ఆ పార్టీ పై దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులకు.. ఎండీఎంఏ మాత్రలు, కొకైన్ పెద్దమొత్తంలో లభించినట్లు సమాచారం. ఇక ఈ పార్టీలో ఆంధ్రా, బెంగళూరుకి చెందిన దాదాపు 100 వ్యక్తులు పాల్గొన్నట్లు తెలుస్తుంది.

వీరిలో టాలీవుడ్ నటులు శ్రీకాంత్, హేమ కూడా ఉన్నారంటూ.. ఈరోజు ఉదయం నుంచి వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. శ్రీకాంత్ విషయంలో అయితే ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మీడియాకి కనిపించకుండా.. మొహం దాచుకుంటున్న ఓ వ్యక్తి చూడడానికి అచ్ఛం శ్రీకాంత్ లాగానే కనిపిస్తున్నాడు. దీంతో శ్రీకాంత్ కూడా ఆ పార్టీలో పోలీసులకు పట్టుబడ్డారని వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలతో టాలీవుడ్ లో గందరగోళం మొదలైంది. నిజంగానే హేమ, శ్రీకాంత్ రేవ్ పార్టీలో పాల్గొన్నారా..? అంటూ పలువురు వారికీ కాల్స్ చేసి కనుకుంటున్నారు.

దీంతో శ్రీకాంత్ అండ్ హేమ.. అసలు విషయం ఏంటో తెలియజేస్తూ వీడియో మెసేజ్ ని రిలీజ్ చేసారు. శ్రీకాంత్ తన ఇంటిలోనే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తి చూడడానికి తనలాగానే ఉన్నాడని, ఆ వీడియో చూసి తాను కూడా షాక్ అయ్యినట్లు చెప్పుకొచ్చారు. కాగా ఆ వీడియోలో కనిపించేది తాను కాదని, ఆ వార్తలు నమ్మకండి అంటూ వెల్లడించారు. ఇక హేమ కూడా హైదరాబాద్ లోనే ఉన్నట్లు చెప్పుకొస్తూ ఒక వీడియో రిలీజ్ చేసారు. తాను ఏ రేవ్ పార్టీలకు హాజరు కాలేదని చెప్పుకొచ్చారు.

  Last Updated: 20 May 2024, 04:40 PM IST