Chiranjeevi : చిరంజీవి ప్రచారానికి రాబోతున్నారు.. నటుడు పృథ్వీ కామెంట్స్..

పవన్ కోసం చిరంజీవి ప్రచారానికి రాబోతున్నారు.. నటుడు పృథ్వీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Tollywood Actor Prudhvi Raj Comments About Chiranjeevi Campaign For Janasena

Tollywood Actor Prudhvi Raj Comments About Chiranjeevi Campaign For Janasena

Chiranjeevi : ప్రస్తుతం ఏపీ ఓటర్స్ అంతా చిరంజీవి రాక పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పేసి సినిమాల్లో బిజీ అయిన చిరు.. ఇన్నాళ్లు పాలిటిక్స్ పై స్పందించకుండా మౌనం పాటిస్తూ వచ్చారు. తన సోదరుడు పవన్ గురించి కూడా మాట్లాడడానికి చిరంజీవి ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు. కానీ ఈ ఎన్నికల్లో చిరు తన మౌనాన్ని వీడారు. తమ్ముడు కోసం గొంతు విప్పి జనసేనకి ప్రజలు మద్దతు కావాలంటూ సోషల్ మీడియా కాంపెయిన్ చేస్తున్నారు.

అయితే జనసైనికులు అంతా చిరంజీవి ఫీల్డ్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఒక వార్త ఏపీ రాజకీయాల్లో బాగా వైరల్ అవుతుంది. పవన్ కోసం ప్రచారం చేసేందుకు చిరంజీవి పిఠాపురం రాబోతున్నారనే వార్త తెగ హల్‌చల్ చేస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదు. నాగబాబు కూడా చిరంజీవి రాక పై ఇప్పుడే ఎటువంటి క్లారిటీ ఇవ్వలేము అని చెప్పుకొచ్చారు. అయితే చిరు ఎంట్రీ పై ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు.

తన తమ్ముడు కోసం, కూటమి గెలుపు కోసం చిరంజీవి ప్రచారానికి రాబోతున్నారని, మే 5 నుండి మే 11 వరకు చిరంజీవి జనసేన తరుపున ప్రచారం చేయబోతున్నారని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ కామెంట్స్ విన్న జనసైనికుల్లో, మెగా అభిమానుల్లో.. మరింత ఉత్సాహం కనిపిస్తుంది. మరి చిరంజీవి నిజంగానే పవన్ కోసం వస్తారో లేదో చూడాలి.

కాగా పవన్ కోసం ఇప్పటికే నాగబాబు కుటుంబమంతా పిఠాపురంలో సందడి చేస్తుంది. నాగబాబు సతీమణి, వరుణ్ తేజ్ పిఠాపురం వచ్చి ప్రచారం చేసారు. త్వరలోనే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా ప్రచారం చేయబోతున్నారని నాగబాబు చెప్పుకొచ్చారు.

  Last Updated: 29 Apr 2024, 11:06 AM IST