Site icon HashtagU Telugu

Kanthara -2 : ‘కాంతార-2’ కోసం RRR యాక్షన్ ను దింపుతున్న రిషిబ్ శెట్టి

Rrr Action Choreographer Ka

Rrr Action Choreographer Ka

రిషిబ్ శెట్టి (Rishab Shetty) నటించి దర్శకత్వం వహించిన కాంతారా (Kanthara) సినిమా సృష్టించిన సంచలనాలు తెలిసిందే. 16 కోట్లతో తెరకెక్కిన ఆ సినిమా 400 కోట్ల దాకా వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. కాంతార కి ప్రేక్షకులు నుంచి వచ్చిన రెస్పాన్స్ కి కాంతార ప్రీక్వెల్ (Kantara Prequel) ని తెరకెక్కిస్తున్నారు. ఐతే కాంతార 2 పై ఉన్న అంచనాలు రోజు రోజుకి పెంచేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రీక్వెల్ తాలూకా అప్డేట్స్ అభిమానుల్లో ఆసక్తి పెంచుతుండగా..తాజాగా ఈ సినిమాలోని యాక్షన్ కోసం RRR యాక్షన్ కొరియోగ్రాఫర్ ను రంగంలోకి దింపుతున్నారు.

‘RRR’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బల్గేరియన్ (Bulgaria) యాక్షన్ కొరియోగ్రాఫర్ (Action Choreographer) టోడర్ లాజరోవ్ పని చేయనున్నారు. ‘కాంతార’కు మించి సినిమాటిక్ క్వాలిటీని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతోనే టోడర్ను తీసుకున్నారట రిషబ్. RRRలో యాక్షన్స్ సీక్వెన్స్తో ఆకట్టుకున్న టోడర్ కాంతారను ఎలా చూపిస్తారో చూడాలి మరి. కాంతార కథ ప్రధానంగా గ్రామీణ నేపథ్యంతో, భూమి, సంప్రదాయం, దేవతలు, ప్రజలు మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాలను చర్చిస్తుంది. ఇది భూత కోల, పంజుర్లి వంటి దైవ పూజలతో, కర్ణాటక ప్రాంతంలో ఉన్న జానపద విశ్వాసాలు, పూజా పద్ధతులు, సాంస్కృతిక అంశాలను ప్రతిబింబిస్తుంది. భూమిపై జనసామాన్యుల హక్కులు, సంప్రదాయాలకు గౌరవం, స్థానిక సముదాయాల్లో ఉన్న నమ్మకాలు ఈ కథనంలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. మరి ఈ సెకండ్ పార్ట్ కథ ఎలా ఉంటుందో చూడాలి. ఇదిలా ఉంటె..హనుమాన్ 2 లో రిషిబ్ శెట్టి నటిస్తున్నారు. ఈ విషయాన్నీ హనుమాన్ మేకర్స్ తాజాగా రివీల్ చేసారు. హనుమాన్ పాత్రలో రిషబ్ కనిపించబోతున్నారు.

Read Also : 4000 Year Old Town : ఒయాసిస్ మాటున.. 4వేల ఏళ్ల కిందటి పట్టణం