Jr NTRs Birthday : ఈరోజు (మే 20న) జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. 1983 మే 20న జూనియర్ ఎన్టీఆర్ జన్మించారు. జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్‌గ్రౌండ్ పెద్దదే. ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ మనవడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పెద్ద స్టార్. అయితే ఆయన కెరీర్ మాత్రం చాలా సింపుల్‌గా, సాదాసీదాగా మొదలైంది. నందమూరి మూడో తరం నటవారసుడిగా టాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చారు. ‘నిన్ను చూడాలని’ మూవీలో ఆయన తొలిసారి హీరో పాత్రను పోషించారు. స్టూడెంట్ నెం.1తో హీరోగా తొలి హిట్టును సాధించారు. ఎత్తుపల్లాలతో కూడిన ఆయన కెరీర్‌తో ముడిపడిన మరిన్ని ఆసక్తికర విశేషాలను తెలుసుకుందాం..
Also Read :Rs 400 Crore Gold Bribes: రూ.400 కోట్ల బంగారం ముడుపులు.. ఏపీ లిక్కర్ మాఫియాకు సమర్పయామి!
తాతతో తొలి మూవీ నుంచి డ్రీమ్ రోల్ దాకా..
- జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్‌లో చదువుకున్నారు. నగరంలోనే ఉన్న సెయింట్ మేరీ కాలేజీలో ఇంటర్ చేశారు.
- ఆయన దాదాపు 8 భాషల్లో మాట్లాడగలరు.
- జపాన్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఏకైక తెలుగు హీరో తారక్. ఆయన నటించిన బాద్‌షా సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది.
- నంబర్ 9 అంటే తారక్‌కు సెంటిమెంట్. ఆయన వాహనాల నంబర్లన్నీ 9తోనే ఉంటాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ నంబర్‌ను రూ. 10లక్షలతో తారక్ కొన్నారు.
- పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీతో బాల నటుడిగా టాలీవుడ్‌లోకి తారక్ ప్రవేశించారు. అప్పటి నుంచే ఆయన్ను అందరూ జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీలో హీరోగా ఎన్టీఆర్ నటించారు.
- ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా హిందీ వెర్షన్‌లో తారక్(Jr NTRs Birthday) మేకప్ వేసుకున్నారు. అయితే అప్పట్లో విశ్వామిత్ర హిందీ వర్షన్ విడుదల కాలేదు.
- రామాయణం మూవీలో బాలరాముడి పాత్రను జూనియర్ ఎన్టీఆర్ పోషించారు.
- అమ్మ (శాలనీ) చిరకాల కోరికను తారక్ తీర్చారు. ఆమె స్వగ్రామం కుందాపురంలో ఉన్న ఉడుపి శ్రీకృష్ణ ఆలయ దర్శనానికి తీసుకెళ్లారు.
- తారక్- ప్రణతి దంపతులకు ఇద్దరు అబ్బాయిలు అభయ్, భార్గవ్. కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు.
- మాతృదేవోభవ సినిమాలో ఉన్న ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం.
- తారక్‌కు ఫేవరెట్ సినిమా ‘దాన వీర శూర కర్ణ’. ఇప్పటివరకు ఈ మూవీని ఆయనవందసార్లకుపైనే చూశారట.
- జై లవకుశ మూవీలో త్రిపాత్రాభినయంతో జూనియర్ ఎన్టీఆర్ మెప్పించారు.
- మహాభారతంలో కృష్ణుడి పాత్ర అనేది జూనియర్ ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ అట. దర్శక ధీరుడు రాజమౌళి మహాభారతం సినిమాను తీస్తానని గతంలోనే ప్రకటించాడు. అందులో ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ లో నటిస్తాడేమో చూడాలి.