Nagarjuna Birthday Special : ‘హీరోగా పనికి రాడు’ అన్నవాళ్లకు.. నాగార్జున ఎలా ఆన్సర్ ఇచ్చారో తెలుసా ?

Nagarjuna Birthday Special :  ఇవాళ (ఆగస్టు 29) హీరో నాగార్జున బర్త్ డే.. టాలీవుడ్ ‘కింగ్’ అభిమానులకు ఈరోజు పండుగ రోజు..

Published By: HashtagU Telugu Desk
Nagarjuna Birthday Special

Nagarjuna Birthday Special

Nagarjuna Birthday Special :  ఇవాళ (ఆగస్టు 29) హీరో నాగార్జున బర్త్ డే.. 

టాలీవుడ్ ‘కింగ్’ అభిమానులకు ఈరోజు పండుగ రోజు..

అక్కినేని ఫ్యామిలీకి ఇవాళ ఒక ఉత్సవం.. 

అక్కినేని నాగేశ్వర్ రావు నటవారసుడిగా మూవీ ఇండస్ట్రీలోకి ప్రవేశించినా.. ట్యాలెంట్ తోనే పెద్ద ఎత్తులను అధిరోహించిన ఘనత నాగార్జున సొంతం. 

ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చే నటులంతా నాగార్జునను రోల్ మోడల్ గా తీసుకొని మూవీ ఇండస్ట్రీలో మున్ముందుకు సాగుతున్నారు. 

నాగార్జున బర్త్ డే వేళ.. కొత్త అప్ డేట్ 

బర్త్ డే వేళ నాగార్జున నుంచి ఇవాళ కొత్త అప్ డేట్ రాబోతోంది. చాలా రోజులుగా వార్తలకే పరిమితమైన Nagarjuna 99వ సినిమా ప్రాజెక్ట్ ని అధికారికంగా ఈరోజు నాగార్జున అనౌన్స్ చేయబోతున్నారు. ‘కింగ్ వస్తున్నాడు’ అంటూ సోమవారం రోజే నాగార్జున 99వ మూవీ మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఇందులో నాగ్ సైకిల్, దాని మీద ఒక పెద్ద కత్తి, బ్యాక్ గ్రౌండ్ లో విలేజ్ సెటప్ కనిపిస్తోంది. నాగ్ ఈసారి ఊర మాస్ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల కాలంలో చాలా ప్రోగ్రామ్స్ లో నాగార్జున లాంగ్ హెయిర్, రఫ్ గడ్డం మెయింటైన్ చేశారు. దీన్నిబట్టి..  నాగార్జున 99వ సినిమాలో ఆయన వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నారనే తేటతెల్లం అవుతోంది.  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో ఈ సినిమా వస్తోంది. అయితే ఈ మూవీ డైరెక్టర్ ఎవరనేది ఇంకా వెల్లడికాలేదు.

పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈరోజు Nagarjuna 99 మూవీకి సంబంధించిన టైటిల్ ను అనౌన్స్ మెంట్ చేయడంతో పాటు ఓ టీజర్ ను కూడా రిలీజ్ చేయనున్నారని  తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసి, కంటెంట్ ను రెడీగా పెట్టారని సమాచారం. నాగ్ 99వ సినిమాకు ‘గలాటా’ ‘భలే రంగడు’ అనే టైటిల్స్ ను పరిశీలించిన తర్వాత, ఫైనల్ గా ‘నా సామి రంగా’ అనే టైటిల్ కే నాగ్ ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. వచ్చే సంక్రాంతి నాటికి ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.  సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఇక కింగ్ బర్త్ డే సెలబ్రేషన్స్ వేళ ‘మన్మథుడు’ చిత్రాన్ని 4K ఫార్మాట్ లో రీ రిలీజ్ చేస్తున్నారు.

నాగార్జున కెరీర్ హైలైట్స్ ఇవీ.. 

  Last Updated: 29 Aug 2023, 10:57 AM IST