Chiru Surprise: కైకాలకు చిరంజీవి ‘బర్త్ డే’ సర్ ప్రైజ్!

మెగాస్టార్ చిరంజీవి నటనలోనే కాదు.. మానవత్వంలోనూ మెగాస్టార్ అని నిరూపించుకుంటున్నారు. ఇది అనేక సందర్భాల్లో నిరూపించబడింది కూడా.

Published By: HashtagU Telugu Desk
Kaikala Chiranjeevi

Kaikala Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నటనలోనే కాదు.. మానవత్వంలోనూ మెగాస్టార్ అని నిరూపించుకుంటున్నారు. ఇది అనేక సందర్భాల్లో నిరూపించబడింది కూడా. కరోనా కష్టకాలంలో ఎంతోమంది కార్మికులకు చిరుసాయం చేశారు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వెంటనే పలుకరించే ప్రయత్నం చేస్తారు.

తాజాగా చిరంజీవి ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో కేకు కోయించి వేడుకలు చేశారు. కైకాలకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు.

  Last Updated: 26 Jul 2022, 09:53 AM IST