Site icon HashtagU Telugu

Naga Chaitanya: NC24 నుంచి బిగ్ అప్డేట్‌.. మేకింగ్ వీడియో విడుద‌ల‌!

Naga Chaitanya

Naga Chaitanya

Naga Chaitanya: యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) అభిమానులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త! తన కెరీర్‌లోనే మొట్టమొదటిసారిగా నాగ‌ చైతన్య మైథికల్ థ్రిల్లర్ (Mystical Thriller) జానర్‌ను ఎంచుకుని #NC24 చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. విరూపాక్ష వంటి సంచలన విజయాన్ని అందించిన దర్శకుడు కార్తీక్ దండు ఈసారి ఊహకు అందని రీతిలో ఈ కథా ప్రపంచాన్ని అద్భుతమైన స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వెనుక ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు ఉండగా బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు ఒక గ్రాండ్ సినిమాటిక్ ట్రీట్ అందించడం ఖాయంగా క‌నిపిస్తోంది.

భారీ మేకింగ్ వీడియోతో అంచనాలు పెంచేశారు

తాజాగా విడుదలైన BTS (బిహైండ్ ది సీన్స్) మేకింగ్ వీడియో సినిమా స్థాయిని, దర్శకుడి విజన్‌ను, నిర్మాణ బృందం పడిన కృషిని కళ్లకు కట్టింది. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర కుమార్ తంగల ఆధ్వర్యంలో నెలల తరబడి వందలాది మంది టెక్నీషియన్లు పనిచేసి, పౌరాణికత ఉట్టిపడేలా విశాలమైన, అద్భుతమైన సెట్‌లను నిర్మించారు.

Also Read: IND vs SA: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. దక్షిణాఫ్రికా సిరీస్‌కు కీలక ఆటగాళ్లు దూరం?

ఈ వీడియోలో నాగ చైతన్య అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ జూజి మాస్టర్ పర్యవేక్షణలో చేస్తున్న తీవ్రమైన శారీరక శిక్షణ ఆకట్టుకుంటోంది. పాత్ర కోసం చైతన్య చూపిస్తున్న అంకితభావం, అతని చురుకుదనం చూస్తే.. ఈ పాత్ర ఎంత ఇంటెన్స్గా ఉండబోతుందో అర్థమవుతోంది. మీనాక్షి చౌదరి కథానాయికగా, లాపతా లేడీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాత్సవ విలన్‌గా నటిస్తుండగా.. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

నవంబర్ 23న డబుల్ ట్రీట్!

నాగ చైతన్య అభిమానులకు మరో సంతోషకరమైన వార్త ఏమిటంటే.. నవంబర్ 23న ఆయన పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్షన్ షెడ్యూల్ వేగంగా జరుగుతోంది. భారీ నిర్మాణ విలువలు, ఉత్తేజభరితమైన కాన్సెప్ట్, అత్యుత్తమ సాంకేతిక నిపుణుల బృందంతో రూపొందుతున్న #NC24.. మైథికల్ థ్రిల్లర్ జానర్‌లో ఒక నూతన ఒరవడి సృష్టించడానికి సిద్ధమవుతోంది.

Exit mobile version