రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు ఎ.ఎస్ రవికుమార్ చౌదరి (AS Ravi Kumar Chowdary) దర్శకత్వంలో సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై నిర్మాత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘తిరగబడరా సామి’ (Tiragabadara Saami). మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లు గా నటిస్తున్న ఈ మూవీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసి ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసారు మేకర్స్.
Tiragabadara Saami Teaser విషయానికి వస్తే..అమాయకంగా ఉండే ఓ యువకుడు తనకు ఎదురైన పరిస్థితుల వల్ల వైలెన్స్ దారిలోకి వెళ్తే ఎలా ఉంటుందో అనే థీమ్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. రాజ్‌తరుణ్ ఇనోసెంట్‌గా పిరికావాడులా కనిపిస్తూనే.. చివర్లో ఫైటింగ్ పవర్‌ఫుల్‌గా కనిపించాడు. హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్ గట్టిగానే ఉన్నట్లు తెలుస్తుంది. బాలయ్య సినిమా టికెట్స్ కోసం మర్డర్ చేసిన తప్పులేదు అని హీరోయిన్ డైలాగ్ చెప్పడం టీజర్ లో హైలైట్‌గా నిలిచింది. ఇక మకరంద్ దేశ్‌పాండే విలన్ రోల్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ‘ఇది నా సామాజ్ర్యం అందరూ గంజాయి వనం అంటున్నారని ఓ తులసి మొక్కను నాటాను. అది ఇప్పుడు కనపడట్లేదు. ‘ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. ఓవరాల్ గా కామెడీ , రొమాంటిక్ , యాక్షన్ ఇలా అన్ని కోణాలు సినిమాలో ఉన్నట్లు టీజర్ లో చూపించారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Read Also : Shakila – Bigg Boss 7 : ‘బిగ్ బాస్’ హౌస్ లోకి షకీల.. ఇంకా లిస్టులో ఉన్నదెవరంటే.. ?
ప్రస్తుతం రాజ్ తరుణ్ సినీ కెరియర్ ఏమాత్రం గొప్పగా లేదు. కెరియర్ మొదట్లో వరుస హిట్స్ అందుకున్న రాజ్..ఆ తర్వాత డిజాస్టర్ సినిమాలతో ప్రేక్షకులను విసుగు తెప్పించాడు. కనీసం ఇప్పుడు రాజ్ తరుణ్ సినిమాలకు ప్రమోషన్ ఖర్చుల వరకు వస్తాయా అని అంత మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో ‘తిరగబడరా సామి’ అంటూ వస్తున్నాడు. మరి ఈసారైనా హిట్ అందుకుంటాడా..? లేక ప్రేక్షకులే తిరగబడలే చేసుకుంటాడా..? అనేది చూడాలి. ఈ లోపు అయితే మీరు టీజర్ ఫై లుక్ వెయ్యండి.