కెరియర్ అంతంతమాత్రంగా ఉన్న క్రమంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) వివాదంలో చిక్కుకున్నాడు. షార్ట్స్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులను అలరించిన రాజ్..ఆ తర్వాత ఉయ్యాలా జంపాల మూవీ తో వెండితెర కు హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే యూత్ ను ఆకట్టుకున్న తరుణ్..ఆ తర్వాత వరుస హిట్ల తో అతి తక్కువ టైంలోనే బిజీ హీరో అయ్యాడు. కానీ ఆ తర్వాత కథల ఎంపికలో తప్పటడుగు వేసి వరుస ప్లాప్స్ మూటకట్టుకున్నాడు.
గత కొద్దీ రోజులుగా హిట్ అనేది లేకుండా పోయిన రాజ్ తరుణ్ కు సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ లో హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి డైరెక్షన్లో రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా, మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్ ప్రధాన పాత్రలలో ‘తిరగబడర సామి ‘ (Thiragabadara Saami) తెరకెక్కింది. ఈ సినిమాను జులై 19 న ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని ఫిక్స్ అయినా నిర్మాత..ఆ మేరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. తీరా రిలీజ్ టైం లో రాజ్ తరుణ్ తనను వాడుకొని వదిలేసాడంటూ అతడి మాజీ లవర్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం వార్తల్లో నిలిచేలా చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
మొదట ఇదంతా సినిమాకు హైప్ తేవడం కోసమే అనుకున్నారు అంత కానీ ఇది నిజమే అని తేలడం తో ఇప్పుడు అంత దీని గురించే మాట్లాడుకుంటున్నారు. నిజంగా మాల్వీ మల్హోత్రా ( Malvi Malhotra ) మాయలో పడి రాజ్ తరుణ్ లావణ్య (Lavanya) ను మోసం చేశాడా..? రాజ్ తరుణ్ అంత నీచుడా..? లావణ్య ను నిజంగా మోసం చేశాడా..? ఆలా అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ కేసులో రోజుకో ట్విస్ట్ నడుస్తుండడం తో ఈ కేసులో ఏంజరుగుతుందో అనే ఆసక్తి అందరిలో పెరుగుతూ వస్తుంది. లావణ్య ఫిర్యాదుతో నిన్న రాజ్ తరుణ్ ఫై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు తాజాగా హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపై కేసు ఫైల్ చేశారు.
రాజ్ తనను పెళ్లి చేసుకుని మోసం చేసి, మాల్వీకి దగ్గరయ్యాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ కలిసి తనను డ్రగ్స్ కేసులోనూ ఇరికించారని ఆరోపించారు. ఇలా ఈ వ్యవహారం మొత్తం ఇప్పుడు సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు నిర్మాత. జులై 17 న రిలీజ్ కాస్త ఆగస్టు 02 కు వెళ్ళింది. ఈ సమయంలో రాజ్ తరుణ్ – మాల్వి ప్రమోషన్స్ కి బయటకి వస్తే సినిమా గురించి అడగడం కాదు అంత రాజ్ – లావణ్య – మాల్వీ మల్హోత్రా గురించే అడుగుతారని, ఇప్పుడు రాజ్ తరుణ్ ఇమేజ్ నెగిటివ్ గా ప్రమోట్ అవుతుందని, ఇప్పుడు సినిమా రిలీజ్ చేస్తే కష్టమే అని ఆలోచించి తిరగబడర సామీ సినిమాని ఆగస్టు 2కు వాయిదా వేశారు. మరి అప్పటికల్లా ఈ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందేమో చూడాలి.
Read Also : TDP : వైసీపీ పాలనతో రాష్ట్రం దివాలా తీసింది : సీఎం చంద్రబాబు