Site icon HashtagU Telugu

Raviteja: మాస్ మహారాజ్ తో టిల్లు

Mass Maharaj With Tillu

Mass Maharaj With Tillu

Mass Maharaj: మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) ప్రధాన పాత్ర లో హరీష్ శంకర్ దర్శకత్వంలో టి జి విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mister Bachan). ఆ మధ్య రాజమౌళి (Rajamouli) కాఫీ విత్ కరణ్ షో నుంచి రవితేజ కి కాల్ చేయగ ఆయన కాలర్ ట్యూన్ “పాన్ బనారస్ వాలా” ఫేమస్ అమితాబ్ బచ్చన్ (Amithabachan) సాంగ్ వినిపించింది. ఈ ఒక్క సంఘటన చాలు రవితేజ అమితాబ్ కి ఎంత పెద్ద ఫ్యాన్ అనే విషయం చెప్పటానికి. అదే విధంగా డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా అమితాబ్ కి వీరాభిమానే. ఈ ఇద్దరు వీరాభిమానులు కలిసి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో సినిమాని తెరకెక్కించటమే ఇ సినిమా పైన అంచనాలు అమాంతం పెంచేశాయి.

ఆగష్టు 15న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసారు అంట డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar). అదే స్టార్ బాయ్ సిద్దు ఈ సినిమా లో గెస్ట్ రోల్ లో మెరవబోతున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతుంది. టిల్లు (Dj Tillu), టిల్లు స్క్వేర్ సినిమాలతో సిద్దు తెలుగు యువతకి ఎంత దగ్గర అయ్యారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు తన నటన మరియు స్లాంగ్ తో యూత్ ఆడియన్స్ ని చాల ఆకట్టుకున్నారు స్టార్ బాయ్ టిల్లు. ఇప్పడు సిద్దు మిస్టర్ బచ్చన్ లో అదితి పాత్రలో కనిపించబోతున్నారు అనే న్యూస్ అటు మాస్ మహారాజా ఫాన్స్ మరియు స్టార్ బాయ్ అభిమానులలో ఆనందం నింపింది. దానికి సంబంధించి షూటింగ్ కూడా ఈ మధ్యే సీక్రెట్ గా ముగించారట డైరెక్టర్ హరీష్ శంకర్. సినిమా చివరలో కొద్దీ నిముషాలు కనిపించే ఈ పాత్ర సినిమాకె హైలైట్ అనే లీక్స్ వస్తున్నాయి.

రవితేజ ఐటీ అధికారిగా 1980-90 మధ్య సాగే ఈ సినిమాలో భాగ్యశ్రీ భొర్సే (Bhagya Sri Bhorse) కథానాయికగా, జగపతి బాబు ప్రతినాయకుడు పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మరియు పాటలు అంచనాలు పెంచగా, టిల్లు కూడా అదితి పాత్రలో కనిపించబోతున్నారు అనే వార్తతో ప్రేక్షకులలో ఉత్కంఠ తార స్థాయి కి చేరింది. సినిమా రిలీజ్ అయ్యాక ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.