Site icon HashtagU Telugu

Tillu Square : టిల్లు స్క్వేర్ శ్రీలీల.. వద్దనుకుంది అందుకేనా..?

Srileela Lucky Chance with Naga Chaitanya

Srileela Lucky Chance with Naga Chaitanya

Tillu Square సిద్దు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన సినిమా డీజే టిల్లు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. డి జె టిల్లు అదొక మ్యాజిక్ లాగా అనిపించింది. యూత్ ఆడియన్స్ ఏ కాదు ఆ సినిమాని ఫ్యామిలీస్ కూడా విపరీతంగా చూశారు. ఆ క్రేజ్ చూసే బిజెపిలు సీక్వెల్ ప్లాన్ చేశారు మేకర్స్. డిజె టిల్లు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే మూవీ ప్లాన్ చేశారు.

అదే సితార బ్యానర్ ఈ మూవీని నిర్మించిన డైరెక్టర్ ని మాత్రం మార్చేశారు. డిజె టిల్లుని విమల కృష్ణ డైరెక్ట్ చేయగా.. పిల్లో స్క్వేర్ ని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమా రేంజ్ ఏంటో చూపించారు మేకర్స్. యూత్ ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు స్క్వేర్ లో ఉన్నాయి. సినిమా ట్రైలర్ లో అనుపమ రెచ్చిపోవడం చూసి అందరూ అవాక్కయ్యారు.

అయితే టిల్లు స్క్వేర్ లో మొదట హీరోయిన్ గా అనుకున్నది అనుపమని కాదు. సూపర్ ఫామ్ లో టాలీవుడ్ అందరు హీరోలతో జతకడుతున్న శ్రీలీలని టిల్లు స్క్వేర్ హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. కొంత పార్ట్ షూటింగ్ కూడా జరిగిందని టాక్. అయితే సినిమాలో హీరోయిన్ లో లిప్ లాక్స్ ఉన్నాయని తెలుసుకున్న శ్రీ లీల సడన్ గా సినిమా నుండి ఎగ్జిట్ అయింది. టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూశాక శ్రీదేవి చేయకుండా ఉండటమే బెటర్ అనిపించింది. అయితే ఇది అనుపమ కి మాత్రం కచ్చితంగా ప్లస్ అయ్యేలా ఉంది. మరి టిల్లు స్క్వేర్ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో మార్చి 29న తెలుస్తుంది.