Site icon HashtagU Telugu

Tillu Square: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న టిల్లుగాడు.. 100 కోట్లకు దగ్గరలో టిల్లు స్క్వేర్

Tillu

Tillu

Tillu Square: మార్చి 29, 2024న విడుదలైన టిల్లు స్క్వేర్ కమర్షియల్ హిట్ అందుకుంది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. విడుదలైన 6 రోజుల్లోనే టిల్ స్క్వేర్ రూ. బాక్సాఫీస్ వసూళ్లలో 91 కోట్ల గ్రాస్ సాధించింది. ఇవాళ రోజు ముగిసే సమయానికి, ఈ క్రైమ్ కామెడీ రూ. 100 కోట్ల మైలురాయి అందుకోనుంది. సిద్ధూ అద్భుతమైన నటనకు ఒక అద్భుతమైన విజయాన్ని సూచిస్తుంది.

డీజే టిల్లులో మెయిన్ లీడ్‌గా నటించిన నేహా శెట్టి ఈ సీక్వెల్‌లో గుర్తించదగిన పాత్రను పోషిచింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన, టిల్ స్క్వేర్ సక్సెస్ కావడంతో పార్ట్ 3 కూడా ఉండబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం స్ట్రిప్ట్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే టిల్లుగాడు మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయొచ్చు.

కాగా టిల్లు స్వ్కేర్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల‌లోపే ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే టిల్లు స్క్వేర్ డిజిట‌ల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ది. ఫ్యానీ రేటుకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం. ఏప్రిల్ 26 నుంచి టిల్లు స్క్వేర్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ డేట్‌ను దాదాపుగా నెట్‌ఫ్లిక్స్ క‌న్ఫామ్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. త్వ‌ర‌లోనే టిల్లు స్వ్కేర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానున్న‌ట్లు స‌మాచారం. సినిమా విడుదల నుంచే ఈ మూవీపై భారీ అంచనాలు ఉండటంతో ఓటీటీ ప్రేక్షకులు ఆస్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఇక యూఎస్ ఏలో భారీ కలెక్షన్లు సాధించడం విశేషం.