Site icon HashtagU Telugu

Anupama Romance : అనుపమ రొమాన్స్ కు మళ్లీ బ్రేక్..

Anupama Romance

Anupama Romance

ప్రేమమ్ , అ ..ఆ , శతమానం భవతి , ఉన్నది ఒక్కటే జిందగీ ఇలా అనుపమ నటించిన ఏ సినిమా చూసిన అచ్చం తెలుగు అమ్మాయిల చక్కటి వస్త్రధారణ తో కనువిందు చేసింది. కానీ సమాజం మారింది..కప్పుకుంటే చూసే రోజులు పోయాయి..ఎంతగా విప్పి చూపిస్తే అంత బాగా మళ్లీ మళ్లీ వచ్చి చూస్తున్నారు. అందుకే అనుపమ కంటే వెనుక వచ్చిన హీరోయిన్లు టాప్ పొజిషన్ కు వెళ్తే..అనుపమ మాత్రం అక్కడే ఉంది. కాస్త లేటుగా తన పద్ధతి మార్చుకొని తన హావ చూపించాలని ఫిక్స్ అయ్యింది. సోషల్ మీడియా లో హాట్ హాట్ భంగిమల్లో అబ్బా అనిపిస్తున్న ఈ కేరళ క్యూటీ.. డీజే టిల్లు గాడి చేతిలో పడింది.

We’re now on WhatsApp. Click to Join.

డీజే టిల్లు అనగానే రాధికా గుర్తుకొస్తుంది..ఆ రాధికను తలదన్నేలా అనుపమ హాట్ హాట్ ఫోజులతో , కిస్సులతో టిల్లు తో రెచ్చిపోయింది. డీజే 2 (Tillu Square) కోసం గత కొద్దీ నెలలుగా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు..కానీ ఈ సినిమా ఎప్పటికప్పుడు రిలీజ్ వాయిదా వేసుకుంటూ అభిమానుల్లో ఇంకాస్త ఆత్రుత పెంచేస్తుంది. 2022 ఆగస్టు లోనే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమాను ..మార్చి 2023 న ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని అనుకున్నారు..కానీ షూటింగ్ ఆలస్యం కావడం..హీరోయిన్ చేంజ్ తదితర అడ్డాకుల ఎదురుకావడం తో నవంబర్ 2023కి రిలీజ్ డేట్ మారిపోయింది. నవంబర్ లో ఖచ్చితంగా వస్తుందని అభిమానులు అనుకున్నారు..కానీ నవంబర్ లో థియేటర్స్ సమస్య రావడం తో 2024 ఫిబ్రవరి 9కి షెఫ్ట్ అయ్యింది. ఇక ఇప్పుడైనా వస్తుందా అని అయోమయంలో ఉండగానే ఇప్పుడు కూడా రావడం లేదని తాజా కబురు అందింది. దీనికి కారణం రవితేజ నటిస్తోన్న ఈగల్ సినిమానే. సంక్రాంతి కానుకగా ఈగల్ రిలీజ్ చేయాలనీ అనుకున్నారు..కానీ అదే సమయంలో వరుస సినిమాలు ఉండడం తో థియేటర్స్ సమస్య తో పాటు కలెక్షన్ల ప్రభావం ఉంటుందని ఫిబ్రవరి వాయిదా వేశారు. ఈగల్ కారణంగా ఇప్పుడు డీజే వెనక్కు పోయింది. దీంతో అభిమానులు మరోసారి నిరాశకు లోనవుతున్నారు. అనుపమ – సిద్దు రొమాన్స్ చూద్దామంటే కుదరడం లేదే..అని తెగ ఫీల్ అవుతున్నారు.

Read Also : Guntur Karam : వివాదంలో గుంటూరు కారం