Tillu Square Family Star డీజే టిల్లు సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ డేట్ పై నిన్నటిదాకా కన్ ఫ్యూజన్ ఉంది. ఐతే ఫైనల్ గా ఆ కన్ ఫ్యూజన్ ని తీసి రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. టిల్లు స్క్వేర్ సినిమా మార్చి 29న రిలీజ్ లాక్ చేశారు.
We’re now on WhatsApp : Click to Join
దేవర సినిమా ఏప్రిల్ 5 నుంచి పోస్ట్ పోన్ అవుతున్న కారణంగా ఆ డేట్ కి అటు ఇటుగా సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక టిల్లు స్క్వేర్ మార్చి 29న వస్తుండగా ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ వస్తాడని తెలుస్తుంది. టిల్లు స్క్వేర్ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మించారు. ఫ్యామిలీ స్టార్ సినిమా దిల్ రాజు నిర్మించారు. ఈ రెండు సినిమాలకు మంచి రిలీజ్ డేట్స్ దొరికాయని చెప్పొచ్చు.
డీజే టిల్లుతో యూత్ ఆడియన్స్ ని మొత్తం ఒక ఊపు ఊపేసిన సిద్ధు జొన్నలగడ్డ మరోసారి ఈ సీక్వెల్ తో సత్తా చాటాలని చూస్తున్నాడు. వారం గ్యాప్ తో రెండు క్రేజీ సినిమాలు వస్తుండటం ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ రెండు సినిమాల గురించి కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి. ఫైనల్ గా ఈ సినిమాల రిలీజ్ డేట్స్ ఫైనల్ అయ్యాయి.
Also Read : Sr NTR : పాట లిరిక్స్ విని.. డాన్స్ చేయలేను అన్న ఎన్టీఆర్.. ఏంటి ఆ పాట..?