Site icon HashtagU Telugu

Tillu Square : పోస్ట్ పోన్ వార్తలపై అప్సెట్ లో టిల్లు స్క్వేర్ ఫ్యాన్స్..!

Tillu Square Release Trailer Makers Super Planning

Tillu Square Release Trailer Makers Super Planning

Tillu Square సిద్ధు జొన్నలగడ్డ సూపర్ హిట్ మూవీ డీజే టిల్లుకి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ తోనే అదరగొట్టేశారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి వస్తున్న ఈ క్రేజీ మూవీ మార్చి 29న రిలీజ్ లాక్ చేశారు. అయితే సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతున్నా మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు.

లేటెస్ట్ గా టిల్లు స్క్వేర్ మరోసారి వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్స్ టిల్లు ఫ్యాన్స్ ని అప్సెట్ చేస్తున్నాయి. అసలైతే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. మార్చి 29న సినిమా పక్కా రిలీజ్ అని చెప్పిన చిత్ర యూనిట్ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు.

సినిమా రిలీజ్ ఫిక్స్ అయితే ఈ పాటికి ప్రమోషన్స్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. కానీ వారు ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. ఇంతకీ టిల్లు స్క్వేర్ అనుకున్న డేట్ కి వస్తుందా లేదా.. సినిమా రిలీజ్ పై క్లారిటీ ఎప్పుడొస్తుంది అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టిల్లు స్క్వేర్ సినిమా ను మల్లిక్ రాం డైరెక్ట్ చేయగా సినిమా బిజినెస్ మాత్రం భారీగా చేసినట్టు తెలుస్తుంది.