సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రాం డైరెక్షన్ లో వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్ (Tillu Square). డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగినట్టుగానే ప్రచార చిత్రాలు ఉండటంతో టిల్లు స్క్వేర్ పై ఇంకాస్త అంచనాలు పెరిగాయి. సినిమాలో అనుపమ గ్లామర్ ట్రీట్ ఆడియన్స్ కు కన్నుల విందు అనేలా ట్రైలర్ ప్రెజెంట్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇంకేముందు యూత్ కు కావాల్సిన అన్ని అంశాలు ఉండటంతో భారీ అంచనాలతో రిలీజైన టిల్లు స్క్వేర్ ఆ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. వీకెండ్ లోనే కాదు వీక్ డేస్ లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో టిల్లు దూకుడు కనపరుస్తూ వచ్చాడు. నాలుగు రోజుల కలెక్షన్స్ అన్ని సెంటర్లలో సినిమాను బ్రేక్ ఈవెన్ స్థాయికి తీసుకువెళ్లింది. మొత్తం నాలుగు రోజుల్లో ఈ సినిమాకు రూ.78కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీటీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. రెండో వారం పూర్తి అయ్యేసరికి రూ.100 కోట్లు సాదించింది.
ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా, టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్ర డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ..ఏప్రిల్ 26 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Read Also : Nabha Natesh : ప్రియదర్శి, నభా నటేష్ గొడవలోకి రీతూవర్మ ఎంట్రీ.. ఏంటి మీ పంచాయితీ..