Site icon HashtagU Telugu

Tillu Square Glimpse : ‘టిల్లు స్క్వేర్’ గ్లింప్స్ విడుదల..

Tillu Square Glimpse

Tillu Square Glimpse

ఈరోజు సిద్ధూ జొన్నలగడ్డ (Siddu ) పుట్టిన రోజు (Birthday) సందర్బంగా ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) మూవీ నుంచి గ్లింప్స్ (Glimpse ) విడుదల చేసి అభిమానుల్లో సంతోషం తో పాటు సినిమా ఫై అంచనాలు పెంచారు. డీజే టిల్లు కు సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా..పలు కారణాలతో సినిమా వాయిదా పడుతూ వస్తుంది. రీసెంట్ గా మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈరోజు సిద్దు బర్త్ డే సందర్బంగా మేకర్స్ స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేసారు. ఈ గ్లింప్స్‌లో టిల్లు కారు న‌డుపుతండ‌గా వెన‌కాల కూర్చున అత‌ని ఫ్రెండ్ టిల్లుకు హ్య‌పీ బ‌ర్త్ డే అని చెప్ప‌గా.. ప‌క్క‌నే కూర్చున్న లిల్లీ (అనుపమ ) అయ్యో స్వారీ అంటూ ముద్దు పెట్టి హ్యాపీ బ‌ర్త్ డే అని చెబుతుంది. ఈ సంద‌ర్భంగా లాస్ట్ ఇయ‌ర్ నీ పుట్టిన‌రోజు ఎలా జ‌రిగింది అని అడుగుతుంది. ఈక్ర‌మంలో టిల్లు లాస్ట్ ఇయ‌ర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రాధిక‌తో క‌లిసి చేసిన వ్య‌వ‌హారాల‌ను గుర్తు చేసుకునే స‌న్నివేశాల‌ను ఈ గ్లింప్స్‌లో చూపించారు. ఈ గ్లింప్స్‌ ‘డీజే టిల్లు’లో జరిగిన విషయాలను గుర్తు చేయడమే కాకుండా, ‘టిల్లు స్క్వేర్’ ఎలా ఉండబోతుందనే ఆసక్తిని కలిగించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు.

ఇక సిద్దు ఈ మూవీ తర్వాత నందిని రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. అలాగే, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో జాక్ అనే సినిమా చేయబోతున్నాడు. అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ చేసి సక్సెస్ అందుకున్న భాస్కర్..ఈసారి కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ రెడీ చేశారట. అందులో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాముఖ్యం ఉండడం తో వైష్ణవి ని ఎంపిక చేసినట్లు చెపుతున్నారు.

Read Also : AP : థియేటర్ లో జగన్ యాడ్ కనిపించగానే చెప్పులు విసురుతున్నారు …