Site icon HashtagU Telugu

Anupama Parameswaran : 2 కోట్లకు న్యాయం చేయకపోతే ఎలా అనుకుంది కాబోలు.. టిల్లు స్క్వేర్ అనుపమ రెమ్యునరేషన్ లీక్..!

Tillu Square Anupama Parameswaran Remuneration Shock

Tillu Square Anupama Parameswaran Remuneration Shock

Anupama Parameswaran సిద్ధు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లు కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను మల్లిక్ రాం డైరెక్ట్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించినందుకు గాను అనుపమ పరమేశ్వరన్ కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం అనుపమకు 2 కోట్ల దాకా పారితోషికం ఆఫర్ చేశారట.

ఆ రేంజ్ రెమ్యునరేషన్ ఇచ్చారు కాబట్టే సినిమాలో అమ్మడు కూడా ఒక రేంజ్ లో రెచ్చిపోయింది. అనుపమ మార్కెట్ అసలైతే కోటి కోటిన్నర దాకా ఉండగా టిల్లు స్క్వేర్ సినిమాకు 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చారట. టిల్లు స్క్వేర్ లో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో పాటుగా అనుపమ గ్లామర్ కూడా హైలెట్ గా నిలిచేలా ఉంది.

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ ఇద్దరి రొమాన్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తుంది. మార్చి 29న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగినట్టు తెలుస్తుంది. సినిమాకు డిజిటల్ రైట్స్ కి కూడా ఫ్యాన్సీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.

Also Read : Ivana : దళపతి సినిమా ఆఫర్ కాదన్న ఇవానా.. లవ్ టుడే హీరోయిన్ ఎందుకిలా చేసింది..?