Site icon HashtagU Telugu

Tilak Varma : పుష్ప 3లో నటిస్తావా? అల్లు అర్జున్ లాగా ఉన్నావు.. తిలక్ వర్మను ప్రశ్నించిన సూర్యకుమార్ యాదవ్..

Tilak Varma Surya Kumar Yadav Discussion about Allu Arjun and Pushpa

Tilak Varma

Tilak Varma : ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప 2(Pushpa 2) క్రేజ్ ఉంది. దేశమంతా పుష్ప 2 మేనియా నడుస్తుంది. నేడు బీహార్ రాజధాని పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా పుష్ప గురించి క్రికెట్ లో చర్చ వచ్చింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ని టీమిండియా 3-1 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్ లో రెండు సెంచరీలు చేసి తిలక్ వర్మ బాగా పాపులర్ అయ్యాడు.

అయితే సిరీస్ అయ్యాక సరదాగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తిలక్ వర్మను ఇంటర్వ్యూ చేసాడు. ఈ ఇంటర్వ్యూలో సూర్య కుమార్.. నీ హెయిర్ స్టైల్ సీక్రెట్ ఏంటి? అందరూ నిన్ను అల్లు అర్జున్ లాగా ఉన్నావు అంటున్నారు. అక్కడ తెలుగులో అల్లు అర్జున్ సూపర్ స్టార్ అయితే ఇక్కడ నువ్వా అని అడిగాడు. దానికి తిలక్.. అదేమీ లేదు. హెయిర్ ఇలా ఉంటే బాగుంది. హెల్మెట్ పెట్టుకుంటే ఈ హెయిర్ తో ఆ ఫీల్ బాగుంది. ఈ హెయిర్ చూసి అల్లు అర్జున్ అని అంటున్నారు అని తెలిపాడు.

అయితే పుష్ప 3 సినిమాలో నటిస్తావా అని తిలక్ వర్మను సూర్య కుమార్ యాదవ్ అడగడంతో.. అలాంటిదేమి లేదు. నేను బాల్, బ్యాట్ తో గ్రౌండ్ లో ఆడతాను. బయట ఎంజాయ్ చేస్తాను. ఇంకేమన్నా ఉంటే దేవుడు చూసుకుంటాడు అని అన్నాడు. దీంతో ఈ ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. బన్నీ ఫ్యాన్స్ ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు.

 

Also Read : Prabhas Rajasaab : రాజా సాబ్ లో హవా హవా సాంగ్.. థియేటర్ దద్దరిల్లాల్సిందే..!