Site icon HashtagU Telugu

Tiger Shroff Likes Allu Arjun: అల్లు అర్జున్ కు పెద్ద అభిమానిని.. టైగర్ ష్రాఫ్ కామెంట్స్!

Allu Arjun

Allu Arjun

అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పుష్ప విడుదల తర్వాత ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అతనికి చాలా మంది ప్రముఖ అభిమానులు ఉన్నారు. అందులో హీరోహీరోయిన్లు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ఒకరు. అల్లు అర్జున్‌ని దక్షిణాది నుండి తన అభిమాన నటుడు అని తన అభిమానం వ్యక్తం చేశాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో ‘ఆస్క్ మి ఎనీథింగ్’ సెషన్‌లో టైగర్ ష్రాఫ్ తన అభిమాన సౌత్ స్టార్‌ గురించి మాట్లాడాడు. సౌత్‌లో తన ఫేవరెట్ స్టార్ ఎవరు అని టైగర్‌ని ఓ అభిమాని ప్రశ్నించగా.. ‘ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్’ అని బదులిచ్చాడు. టైగర్ జవాబు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది.

టైగర్ అల్లు అర్జున్ అభిమాని అయితే, అతని కొడుకు అల్లు అయాన్ టైగర్ అభిమాని. అల్లు అయాన్ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ హార్డ్ కోర్ అభిమాని. ఈ స్టార్ కిడ్ టైగర్‌కి పిచ్చి అభిమాని. అతన్ని ‘టైగర్ స్క్వాష్’ అని ముద్దుగా పిలుచుకుంటాడు అయాన్. చాలా సార్లు అయాన్ టైగర్ పట్ల తన ప్రేమను చాటుకున్నాడు. అల్లు అర్జున్ పుష్ప: ది రూల్ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. పుష్పకు ముందే అల్లు అర్జున్ దర్శకుడు వేణు శ్రీరామ్‌తో ‘ఐకాన్’ అనే సినిమా స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ అనివార్య కారాణాల వల్ల మూవీ ఆగిపోయింది.

Exit mobile version