Site icon HashtagU Telugu

Tiger Shroff : 30 కోట్ల నుంచి 9 కోట్లకు పడిపోయిన హీరో.. వరుస ఫ్లాపులతో కెరీర్ డైలమా..!

Tiger Shroff Cut Down His Remuneration For Next Movies Bollywood

Tiger Shroff Cut Down His Remuneration For Next Movies Bollywood

Tiger Shroff బాలీవుడ్ యువ హీరో టైగర్ ష్రాఫ్ కి ప్రస్తుతం కెరీర్ బ్యాడ్ ఫేజ్ లో నడుస్తుందని చెప్పొచ్చు. చేస్తున్న సినిమా ప్రతీది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో కెరీర్ రిస్క్ లో పడినట్టు అయ్యింది. ఇప్పటికే అంతకుముందు వచ్చిన రెండు సినిమాలతో ఫ్లాప్ అందుకున్న టైగర్ ష్రాఫ్ రీసెంట్ గా వచ్చిన బడే మియా చోటే మియా సినిమాతో కూడా నిరాశపరిచాడు. అక్షయ్ కుమార్ తో కలిసి చేసిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.

వరుసగా హ్యాట్రిక్ ఫ్లాపులు అందుకున్న టైగర్ ష్రాఫ్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అందుకే సినిమా ఆఫర్ల కోసం తన రెమ్యునరేషన్ ని దాదాపు 70 శాతం వరకు తగ్గించాడని తెలుస్తుంది. మొన్నటిదాకా సినిమాకు 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్న టైగర్ ష్రాఫ్ ఇప్పుడు 9 నుంచి 10 కోట్లు ఇస్తే చాలని అంటున్నాడట. వరుస ఫ్లాపుల వల్లే తను ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.

30 కోట్లు నుంచి 9, 10 కోట్లకు పడిపోయిన టైగర్ ష్రాఫ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కే వరకు ఇదే రెమ్యునరేషన్ తీసుకోవాలని అనుకుంటున్నాడట. సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో పాటుగా తనని తీసుకున్న నిర్మాతలు ఎక్కువ నష్టాలు చూడకూడదనే ఆలోచనతో టైగర్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. టైగర్ ష్రాఫ్ ఖాతాలో హిట్టు పడే సినిమా ఏది అవుతుంది అన్నది చూడాలి.

ప్రతుతం టైగర్ ష్రాఫ్ కథల వేటలో ఉన్నాడు. ఛాన్స్ వస్తే సౌత్ సినిమాల్లో కూడా నటించడానికి రెడీ అంటున్నాడు టైగర్ ష్రాఫ్. మరి టైగర్ ష్రాఫ్ ని ఏ తెలుగు డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తాడన్నది చూడాలి.

Also Read : Mirai Manchu Manoj : మిరాయ్ నుంచి మంచు హీరో లుక్.. ప్రీ లుక్ పోస్టర్ షేక్ అయ్యేలా ఉంటే..!