Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ చూశారా.. రవితేజకు హిట్ గ్యారెంటీ!

మాస్ అంటే రవితేజ.. రవితేజ అంటే మాస్.. అందుకే రవితేజ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు..

Published By: HashtagU Telugu Desk
Raviteja Tiger Nageswara Rao Movie First Look and Glimpse Released

Raviteja Tiger Nageswara Rao Movie First Look and Glimpse Released

Tiger Nageswara Rao: మాస్ అంటే రవితేజ.. రవితేజ అంటే మాస్.. అందుకే రవితేజ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు.. సహజంగా అంచనాలు ఏర్పడటం ఖాయం. రవితేజ ప్రధాన పాత్ర పోషిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంపై అటు ప్రేక్షకుల్లో, ఇటు టాలీవుడ్ సర్కిల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ చిత్రంలోని ప్రతి అప్ డేట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మేకర్స్ విడుదల చేసిన స్టిల్స్, లుక్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుండంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఇవాళ టైగర్ నాగేశ్వర రావు సినిమా ట్రైలర్ నేడు రిలీజ్ అయింది.

నాగేశ్వరరావుకు డబ్బు, బంగారం అంటే ఎంత ఇష్టమో ట్రైలర్‌లో చూపించారు. ‘మగజాతి మొత్తం.. కొలతలే చూస్తారు.. కాకపోతే అనుభూతి, ఆరాధన అని అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది’ కరడు గట్టిన దొంగగా రవితేజ అదరగొట్టారు. యాక్షన్ సీక్వెన్సులు, రవితేజ డైలాగ్స్, చేజింగ్‍లు అదిరిపోయాయి.  దేశంలోనే అతిపెద్ద గజదొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. అయితే స్టువర్టుపురం నాగేశ్వరరావు… టైగర్ నాగేశ్వరరావుగా ఎలా మారుతాడుఅనేది ఈ మూవీ సారాంశం. మొదటిసారి రవితేజ సినిమా ఐదు భాషల్లో విడుదల కాబోతుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

  Last Updated: 03 Oct 2023, 04:13 PM IST