Site icon HashtagU Telugu

Tiger Nageswara Rao Public Talk : టైగర్ నాగేశ్వరరావు టాక్ ఏంటి..?

Tiger Nageswara Rao Public Talk

Tiger Nageswara Rao Public Talk

హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న హీరో మాస్ రాజా రవితేజ (Raviteja). ఓ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరో రెండు సినిమాలను లైన్లో పెడుతూ వస్తున్నాడు. ఈ మధ్యనే ధమాకా (Dhamaka),వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రవితేజ..ఆ తర్వాత రావణాసుర (Ravanasuraa) తో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. అయినప్పటికీ రవితేజ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

తాజాగా వంశీ (Vamsee) డైరెక్షన్లో టైగర్‌ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) మూవీతో పలు భాషల్లో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 1970 కాలంలో స్టూవర్ట్‌పురం (stuartpuram )లో పాపులర్‌ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్‌ రావు (Tiger nageswara rao) జీవిత కథ నేపథ్యంలో పాన్ ఇండియా కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంతో బాలీవుడ్ భామ కృతిసనన్ సోదరి నుపుర్‌ సనన్‌ టాలీవుడ్‌ డెబ్యూ ఇచ్చింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ మూవీలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్‌ ఖేర్ (Anupam Kher) ‌, మురళీ శర్మ, రేణు దేశాయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది..? రవితేజ యాక్టింగ్ ఎలా ఉంది..? సాంగ్స్ ఎలా ఉన్నాయి..? పబ్లిక్ ఏమంటున్నారు అనేది తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join.

తెలుగు రాష్ట్రాల కంటే ముందే ఇతర దేశాల్లో టైగర్ నాగేశ్వరరావు సందడి మొదలైంది. ఓవర్సీస్ లో ఇప్పటికే షోస్ పూర్తి కావడం తో సినిమా ఎలా ఉందనేది సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతమైతే సినిమా కు మిక్సిడ్ టాక్ వినిపిస్తుంది. కొంతమంది సినిమా బాగుందని అంటుంటే..మరికొంతమంది బాగా స్లో గా ఉందని అంటున్నారు. సాంగ్స్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవని , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదని చెపుతున్నారు. రవితేజ యాక్టింగ్ కు వంక పెట్టాల్సిన అవసరం లేదని , పవర్ ఫుల్ రోల్ లో అదరగొట్టాడని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదని , సెకండ్ హాఫ్ బాగా స్లో గా ఉందని , యాక్షన్ సన్నివేశాలు మాత్రం ఓ లెవల్లో ఉన్నాయని , నిర్మాణ వ్యయం భారీగా ఉందని తెరపై వారు పెట్టిన ప్రతి రూపాయి కనిపిస్తుందని చెపుతున్నారు. ఓవరాల్ గా మాత్రం సినిమా కు మిక్సిడ్ టాక్ ను తెలియజేస్తున్నారు. మరి పూర్తి రివ్యూస్ పడితే కానీ సినిమా పరిస్థితి ఏంటి అనేది తెలియదు. మరికాసేపట్లో రివ్యూ ను అందిస్తాం.

Read Also : Whats Today : బీఆర్ఎస్ లోకి రావుల, జిట్టా.. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ