Site icon HashtagU Telugu

Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు నుంచి ఏక్ దమ్ ఏక్ దమ్ లిరికల్ సాంగ్ రిలీజ్

Raviteja Tiger Nageswara Rao Movie First Look and Glimpse Released

Raviteja Tiger Nageswara Rao Movie First Look and Glimpse Released

Tiger Nageswara Rao: రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కొద్దిసేపటి క్రితమే మొదటి సింగిల్ ఏక్ దమ్ ఏక్ దమ్‌ విడుదలైంది. ఆకట్టుకునే వయోలిన్ సంగీతంతో సాగే ఈ పాట ఉల్లాసంగా ఉంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా, జివి ప్రకాష్ కుమార్ స్వరకల్పన లో అనురాగ్ కులకర్ణి  పాడారు. భాస్కరభట్ల రాసిన సాహిత్యం బాగుంది.

ఈ పాటలో రవితేజ ఫుల్ ఎనర్జీతో కనిపిస్తాడు. నూపూర్ సనన్‌తో రొమాన్స్ చేస్తూ హుషారైన స్టెప్పులు వేస్తాడు. ఈ పాన్ ఇండియా చిత్రం మ్యూజికల్ ప్రమోషన్సల్ లో భాగంగా ఇవాళ ఈ పాటను విడుదల చేసింది. అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Also Read: CBN No Arrest : ఆగ‌డు..ఆప‌లేరు.! ఐటీతో అరెస్ట్ తూచ్.!