సినీ పరిశ్రమకు ఏపీ, తెలంగాణా ప్రభుత్వాల సపోర్ట్ చాలా అవసరం. మొన్నటిదాకా తెలంగాణా ప్రభుత్వం పరిశ్రమకు ఏం కావాలో అది ఇస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఐతే పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటన వల్ల సీఎం రేవంత్ రెడ్డి ఇక మీదట బెనిఫిట్ షోస్, టికెట్ రేట్లు (Ticket Price,) పెంచటాలు ఉండవని తెగేసి చెప్పారు. ఐతే సీం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమ పెద్దలకు షాక్ ఇచ్చింది. స్టార్ సినిమాకు వందల కోట్ల బడ్జెట్ పెడుతుంటాం కాబట్టి టికెట్ ప్రైజ్ పెంచమని ప్రభుత్వాన్ని అడుగుతారు.
ఏపీలో గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు కొన్ని సినిమాలకు పెంచి మరికొన్ని సినిమాలకు ఉన్న రేట్ల కన్నా తగ్గించేలా జీవో ఇచ్చారు. ఐతే ఇప్పుడు రాబోతున్న సినిమాలకు ఏపీలో ఎలాంటి ఆంక్షలు లేవు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలు అన్నిటికి ఏపీలో టికెట్ ప్రైజ్ పెంచేలా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఐతే తెలంగాణాలో ఆ విషయంపై ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు. ఎఫ్.డి.సీ చైర్మన్ దిల్ రాజు (Dil Raju) లేటెస్ట్ గా ప్రెస్ మీట్ పెట్టినా తెలంగాణాలో టికెట్ రేట్ల మీద ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని. సీఎం రేవంత్ తో మరోసారి చర్చిస్తామని అన్నారు. చూస్తుంటే తెలంగాణాలో టికెట్ రేట్లు పెంచే అవకాశం లేదన్నట్టే తెలుస్తుంది. మరి సంక్రాంతికి గేం ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల పరిస్థితి ఏంటన్నది చూడాలి.