Site icon HashtagU Telugu

Shahrukh Khan: షారుఖ్ ఖాన్ సినిమాపై అక్కడ ప్రదర్శిస్తే మూడేళ్ల జైలు..

Pathan Shahrukh Khan

Pathan

షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ (Pathaan) ఇటీవలే విడుదలై సూపర్ హిట్.. ఈ మూవీ విడుదలైన ప్రతి చోటా అప్పటి వరకు ఉన్న బాలీవుడ్ మూవీ రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోంది. అయితే ఈ చిత్రంపై పాకిస్తాన్ (Pakistan) నిషేధం (Banned) విధించింది. సింధ్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్స్ సెన్సార్ (SBFC) ఈ చిత్రాన్ని పదర్శించేందుకు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ పలు చోట్ల ఫైర్ వర్క్స్ ఈవెంట్స్ అనే సంస్థ ఈ చిత్రాన్ని రహస్యంగా ప్రదర్శించారు. ఒక్కో టిక్కెట్ ధర 900ల పాకిస్తాన్ రూపాయలు. ఈ విషయం తెలిసిన సెన్సార్ బోర్డు వెంటనే యాక్షన్ తీసుకుంది.

అలాగే.. ‘బోర్డు ద్వారా పబ్లిక్ ఎగ్జిబిషన్ కోసం చిత్రం అనుమతి పొందితే తప్ప, ఎవరు కూడా ఈ మూవీని పబ్లిక్‌గా లేదా ప్రైవేట్‌గా ప్రదర్శించకూడదు. అందుకు విరుద్ధంగా ఎవరైనా అలాంటి చిత్రాలను ప్రదర్శిస్తే బాధ్యులైన వారికి మూడేళ్ల జైలుశిక్ష, రూ. 100,000 (పాకిస్థానీ రూపాయి) వరకు జరిమానా విధిస్తామని పేర్కొంది. అలాగే ఫైర్‌వర్క్ ఈవెంట్‌లను వెంటనే దాని షోలను రద్దు చేయాలి’ అని సెన్సార్ బోర్డు చెప్పుకొచ్చింది.

Also Read:  PAN Card: ఆధార్ తో మీ పాన్ లింక్ అయ్యిందా..? ఇలా తెలుసుకోవచ్చు