Site icon HashtagU Telugu

Mahabharatam Movie : మహాభారతం కోసం ముగ్గురు దర్శకులు..?

Three Tollywood Directors For Mahabharatam Movie

Three Tollywood Directors For Mahabharatam Movie

Mahabharatam Movie కల్కి సినిమాతో వెండితెర మీద మరోసారి మహాభారతం హాట్ టాపిక్ గా మారింది. కల్కి సినిమా టైటిల్ కార్డ్స్ తో పాటుగా చివరి క్లైమాక్స్ లో మహాభారత ఘట్టాలను చూపించారు. 20 నిమిషాల ఈ ఎపిసోడ్స్ తోనే గూస్ బంప్స్ తెప్పించగా మహాభారతం మొత్తం తెర మీద ఆవిష్కరిస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఐతే కల్కి 2 పార్ట్ ఎలా ఉంటుంది అన్న సందేహాలు మొదలయ్యాయి. అది పూర్తిగా మహాభారతం చూపిస్తారా అన్న ఎగ్జైట్ మెంట్ మొదలైంది.

ఇక ఇంతకుముందే తన డ్రీం ప్రాజెక్ట్ గా మహాభారతం తీయాలని ఉందని చెప్పుకొచ్చాడు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. కెరీర్ మొదటి నుంచి క్రేజీ సినిమాలు చేస్తూ వరుస హిట్లు కొడుతున్నాడు ప్రశాంత్ వర్మ తప్పకుండా అతని నుంచి మహాభారతం లోని ఏదైనా ఒక కథ సినిమాగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక దర్శకధీరుడు రాజమౌళి కూడా తన డ్రీం ప్రాజెక్ట్ గా మహాభారతం తీస్తానని అన్నాడు.

బాహుబలి టైం లో మహాభారతం తీయడానికి ఇంకాస్త టైం ఉందని అన్నాడు. ఐతే కల్కి లో మహాభారతం ఎపిసోడ్స్ చూసి నాగ్ అశ్విన్ అటెంప్ట్ ని మెచ్చుకున్న రాజమౌళి తను ఎలా ప్లాన్ చేస్తారన్నది చూడాలి. ఐతే ఈ ముగ్గురు దర్శకులు మహాభారతం ను తమ టేకింగ్ తో చూపించాలని చూస్తున్నారు. అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.

Also Read : Samantha : సమంత ఎందుకిలా చేస్తుంది..?