Site icon HashtagU Telugu

M.S.Subbalakshmi Biopic : వెండితెర సుబ్బలక్ష్మి ఎవరు.. రేసులో ఆ ముగగ్గురు భామలు..!

Three Heroines Are Discussion In M.s.subba Lakshmi Biopic

Three Heroines Are Discussion In M.s.subba Lakshmi Biopic

M.S.Subbalkshmi Biopic ఇప్పటికే ఎంతోమంది మహామహుల జీవిత కథలు వెండితెర మీద ఆవిష్కరించగా ఇప్పుడు ప్రముఖ గాయని, సంగీత కళాకారిణి, నటి ఎం.ఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత కథను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ దర్శక నిర్మాతలు ఎవరన్నది తెలియదు కానీ సుబ్బలక్ష్మి పాత్రలో ఎవరిని తీసుకోవాలి అన్న చర్చ మాత్రం జరుగుతుంది.

అయితే అందరు కూడా మహానటి సినిమాతో మెప్పించిన కీర్తి సురేష్ అయితే ఆ పాత్రకు పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన మహానటి సినిమాలో కీర్తి సురేష్ అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఆ సినిమా రిఫరెన్స్ తీసుకుంటే మాత్రం ఎం.ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో కీర్తి సురేష్ లాక్ అయినట్టే. అయితే కీర్తి సురేష్ ఒకవేళ కుదరకపోతే మాత్రం మరో ఇద్దరు హీరోయిన్స్ ఆ పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరోయిన్స్ నయనతార, త్రిష ఈ ఇద్దరు కూడా ఎం.ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో నటించే ఛాన్స్ ఉందట.

కుదిరితే నయనతార లేదంటే త్రిష ఎవరో ఒకరు ఫైనల్ అవుతారని టాక్. సో ఎం.ఎస్ సుబ్బలక్ష్మిగా ఈ ముగ్గురిలో ఎవరు ఫిక్స్ అవుతారన్నది త్వరలో తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార కెరీర్ కాస్త వెనకపడినట్టు అనిపిస్తుండగా ఎం.ఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథతో తిరిగి ఫాం లోకి రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

Also Read : Mrunal Thakur : సీతామహాలక్ష్మిపై కన్నేసిన భన్సాలి.. ఆమె కోసం ప్రత్యేకంగా నిర్మాతగా మారి..!