Site icon HashtagU Telugu

Prabhas : తండ్రి చనిపోయిన బాధలో కూడా సాయం చేసిన ప్రభాస్

Prabhas Thotaprasad

Prabhas Thotaprasad

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మంచితనం గురించి ఎంత చెప్పిన తక్కువ. గోరంత చేసి కొండంత చెప్పుకునే ఈరోజుల్లో ప్రభాస్ మాత్రం కుడిచేత్తో సాయం చేసి ఎడమచేతికి కూడా తెలియకూడదు అనుకునే గొప్ప వ్యక్తి. కానీ సాయం పొందిన వారు మాత్రం ప్రభాస్ చేసిన సాయాన్ని చెప్పకుండా ఉండలేరు కదా..తాజాగా రైటర్ తోట ప్రసాద్ (Thota Prasad) కూడా ప్రభాస్ గొప్పదనం గురించి తాజాగా చెప్పి ప్రభాస్ గొప్పతనం ఏంటో చెప్పకనే చెప్పాడు.

AMGEN : హైదరాబాద్‌లో అమ్జెన్ ఇన్నోవేషన్ సైట్ ప్రారంభం

‘బిల్లా’ సినిమాకి పని చేసిన రోజులను తోట ప్రసాద్ గుర్తు చేసుకుంటూ ఆ టైంలో ప్రభాస్ చేసిన సాయం గురించి ఎంతో ప్రశంసించారు. 2010లో తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరినప్పుడు, అదే సమయంలో ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు గారు మరణించడం ఇండస్ట్రీ కి పెద్ద విషాదం. అలాంటి కష్ట సమయాల్లోనూ, తన తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నా, ప్రభాస్ తన ఆరోగ్యం గురించి ఆలోచించి ఆర్థిక సహాయం అందించాడని చెప్పుకున్నారు. తాను ఆసుపత్రిలో ఉండగా, ప్రభాస్ ప్రత్యేకంగా ఓ వ్యక్తిని పంపించి, అవసరమైన మొత్తాన్ని అందజేయడం తనను ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని తెలిపారు. ఇది ప్రభాస్ గొప్ప మనసుకు నిదర్శనమని తోట ప్రసాద్ ఎమోషనల్‌గా వెల్లడించారు.

ప్రస్తుతం ప్రభాస్ “రాజా సాబ్”, “ఫౌజీ” చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వీటి తర్వాత “సలార్ 2”, “కల్కి 2898 AD – Part 2” వంటి భారీ సినిమాలు చేయనున్నారు. అలాగే, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో “స్పిరిట్” అనే సినిమా కూడా ప్రకటించినప్పటికీ, అది ఇంకా ప్రారంభం కాలేదు. ప్రభాస్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు సాధిస్తూ, ఆయన క్రేజ్‌ను మరింత పెంచుతున్నాయి.